దేశంలో క-రో-నా నియంత్రణ చర్యల పై జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం, సుమోటోగా తీసుకుని ఈ కేసును విచారణ చేస్తుంది. ఈ కేసు విచారణ సందర్భంగా, సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం టీకా విధానం పై, తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలను వాటి మానన వాటిని వదిలేస్తే, ఏ విధంగా ఉంటుంది ? టీకా ధరల పై ఏకీకృత విధానం ఎందుకు లేకుండా పోయింది ? గ్రామీణులను, నిరక్ష్యరాస్యులు టీకా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకుంటారు ? వయసులు వారీగా టీకాలు ఇవాలనే నిర్ణయం హేతుబద్ధమేనా ? దేశవ్యాప్తంగా ఒకే ధరల విధానం ఎందుకు లేకుండా పోయింది ? ఈ వయసుల వారీగా టీకాలు ఇవ్వాలనే నిర్ణయం ఎవరు నిర్ణయించారు ? ఇలా అనేక ప్రశ్నలు కేంద్రానికి సంధిస్తూ, కేంద్రానికి సుప్రీం కోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. టీకా కొనుగోలు, అదే విధంగా పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పై తమకు స్పష్టత కావాలని, అంతే కాకుండా సంబధిత ఫైల్స్ అన్నీ కూడా సుప్రీం కోర్ట్ ముందు ఉంచాలని కూడా , కేంద్రానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత బడ్జెట్ లో టీకాల కొనుగోలుకి సంబంధించి 35 వేల కోట్లు కేటాయించారు, ఈ 35 వేల కోట్లతో అందరికీ టీకాలు ఎందుకు ఉచితంగా ఇవ్వలేక పోతున్నారు అనే విషయాన్ని స్పష్టం చేయాలని ఆదేశించింది.
ఈ 35 వేల కోట్లను, మీరు ఏ విధంగా ఖర్చు చేయబోతున్నారు అనే అంశం చెప్పాలని ఆదేశించింది. 45 ఏళ్ళు దాటిన వారికి కేంద్రమే టీకాలు కోనోగులు చేస్తూ, రాష్ట్రాలకు పంపిస్తుందని, 18 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ వారి విషయంలో మాత్రం, ఎందుకు ద్వంద్వ విధానాలు అవలంభిస్తున్నారని ? ప్రశ్నించింది. టీకాల ఉత్పత్తిదారులు, రాష్ట్రాలకు, కేంద్రం నిర్ణయించిన ధరకు సరఫరా చేయాలని, మిగతా 50 శాతం ప్రైవేటు హాస్పిటల్ కు ఇవ్వాలి అనే నిర్ణయం ఎవరు తీసుకున్నారు ? ఎంత హేతుబద్దత ఈ నిర్ణయానికి ఉంది అంటూ ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. అసలు కేంద్రం కంటే, రాష్ట్రాలకు ఎక్కవు ధరకు ఇవ్వాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారని, టీకాల ధరలు ఒక్కో చోట ఒక్కో విధంగా కాకుండా, కేంద్రమే ఒకే ధరను నిర్ణయం తీసుకోవాలి కదా అని ప్రశ్నించింది. అసలు కోవీషీల్డ్ ఎంత కొన్నారు, కోవాక్సిన్ ఎంత కొన్నారు, స్పుత్నిక్ ఎంత కొన్నారు, ఇలా పూర్తి వివరాలు తమకు ఇవ్వాలని సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. అలాగే థర్డ్ వేవ్ పై కూడా ఒక బ్లూ ప్రింట్ ను తమకు ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది.