కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేరు గత రెండేళ్ళ నుంచి మారుమొగిపోతుంది. దీనికి ప్రధాన కారణం ఆయన తన పరిపాలన దక్షతతో, క-రో-నా కాలంలో తమ రాష్ట్రానికి చేసిన మంచి పనులు. క-రో-నా ఎదుర్కోవటంలో, దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు. ప్రజలను కూడా ఆదుకున్నారు. కేరళ మోడల్ ని అందరూ ప్రశంసించారు కూడా. ఇది పక్కన పెడితే, క-రో-నా సహయం విషయంలో, రాష్ట్రాలను కేంద్రం సరిగ్గా ఆదుకోలేదని విజయన్, మొదటి నుంచి మోడీ ప్రభుత్వం పై గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా వ్యాక్సిన్ పాలసీ విషయంలో తీవ్ర అభ్యంతరం తెలిపారు. వ్యాక్సిన్ లను కేంద్రమే ఉచితంగా రాష్ట్రాలకు ఇవ్వాల్సింది పోయి, రాష్ట్రాలను కొనుక్కోమని చెప్తున్నారని, తీరా చూస్తే సరైన లభ్యత లేదని అసహనం వ్యక్తం చేసారు. కేంద్రం వ్యాక్సిన్ పాలసీ పై ప్రత్యక్ష పోరాటానికి దిగారు విజయన్. బీజీపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఏకం చేసే పనిలో ఉన్నారు. వ్యాక్సిన్ పాలసీ విషయమై, 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజయన్ లేఖలు రాసారు. వ్యాక్సిన్ లు రాష్ట్రాలకు ఉచితంగా ఇవ్వాలని, సరైన వ్యాక్సిన్ పాలసీ కోసం కేంద్రం పై ఒత్తిడి తేవాలని, ఈ పోరాటంలో అందరూ కలిసి రావాలి అంటూ, విజయన్ తన లేఖలో తెలిపారు.

vijayan 02062021 2

ఈ లేఖలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు , ఏపీ నుంచి జగన్ మోహన్ రెడ్డికి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, రాజస్థాన్ ముఖ్యమంత్రికి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి, చత్తీస్ గఢ్, పంజాబ్, మహారాష్ట్ర, ఢిల్లీ, ఝార్ఖండ్ ఇలా 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసినట్టు ఆయిన తెలిపారు. అయితే మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరు మోడీతో డీ అంటే డీ అంటున్నారు కాబట్టి ఎవరికీ ఇబ్బంది లేదు కానే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఖరి ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ముఖ్యంగా కరోనా విషయంలో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి , ప్రధాని మోడీని విమర్శలు చేయగానే, తనకు సంబంధం లేని విషయంలో కూడా తల దూర్చి, మోడీని వెనకేసుకుని వచ్చారు జగన్ మోహన్ రెడ్డి. దేశం మొత్తం కరోనా విషయంలో మోడీ ఫెయిల్ అయ్యారు అంటుంటే, జగన్ మాత్రం వెనకేసుకుని రావటం ఆశ్చర్యం కలిగించింది. అయితే ఇప్పుడు వ్యాక్సిన్ లు విషయంలో మిగతా బీజీపీయేతర రాష్ట్రాల సియంలతో కలిసి జగన్ పోరాటం చేస్తారో లేదో చూడాలి మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read