మళ్ళీ మూడు రాజధానుల అంశం తెర పైకి వచ్చింది. గత రెండేళ్లుగా, ఈ అంశంలో ముందుకు వెళ్ళలేక పోతున్న జగన్ ప్రభుత్వం, కోర్టులో కేసులు ఉండటం, కోర్టు కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చి ఉండటంతో, ఇప్పుడే వెళ్ళలేని పరిస్థితి ఉంది. అయితే నిన్నటి నుంచి వైసీపీనేతలు కొత్త రాగం అందుకున్నారు. రాజధాని తరలింపు అంశం పై నిన్న విజయసాయి రెడ్డి, ఈ రోజు మంత్రి బొత్సా సత్యన్నారాయణ, వీరు ఇరువురు చేసిన వ్యాఖ్యలు, రాష్ట్రంలో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. డేట్ అడగవద్దు, రాజధాని ఎప్పుడైనా తరలిస్తాం, జగన్ ఎక్కడ ఉంటే అదే రాజధాని, ఎక్కడ నుంచి అయినా పరిపాలించవచ్చు అని నిన్న విజయసాయి రెడ్డి ప్రకటించగా, క్యాంప్ కార్యాలయం తరలించటానికి సీఆర్డీఏ రద్దు అంశం అడ్డుకాదని చెప్పి, బొత్సా సత్యన్నారాయణ వ్యాఖ్యానించారు. ఏ క్షణంలో అయినా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం విశాఖపట్నం నుంచి పని చేస్తుందని చెప్పి, బొత్సా వ్యాఖ్యానించారు. అయితే అమరావతి పరిరక్షణ సమితి మాత్రం, ఇదంతా డైవర్షన్ పోలిటిక్స్ అని చెప్పి, కొట్టిపారేసాయి. రైతులు మాత్రం, తమ త్యాగాలను, తాము చేస్తున్న దీక్షలను గుర్తించకుండా, ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడితే, హైకోర్టులోనే దీని ఎదుర్కుంటాం అని పేర్కొన్నారు. అయితే రాజధాని అంశానికి సంబంధించి, సిఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల అంశం పై, ఇప్పటికే హైకోర్టులో విచారణ జరుగుతుంది.

botsa 03062021 2

క-రో-నా కారణంగా, ఆలాగే వేసవి సెలవులు తరువాత, దీని పై విచారణ జరగనుంది. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని, త్రిసభ్య ధర్మాసనం ఈ కేసు పై విచారణ చేయనుంది. అయితే గతంలో విజిలెన్స్ కార్యాలయాన్ని కర్నూల్ కు తరలిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరుణంలోనే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో పై, రాజధాని రైతులు హైకోర్టులో సవాల్ చేయగా, హైకోర్టు ఈ జీవోని కొట్టేస్తూ, ఆ కార్యాలయాన్ని తరలించవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. మూడు రాజధానుల విషయంలో కూడా ఇప్పుడు హైకోర్టులో స్టేటస్ కో మైంటైన్ అవుతుంది. ఈ స్టేటస్ కో, ఇచ్చిన సందర్భంగా, కార్యలయాలను తరలించేందుకు వీలు లేదని రాజధాని రైతులు చెప్తున్నారు. ఒక వేళ కోర్టు ఆదేశాలు ధిక్కరించి, అలా చేస్తే కనుక, కోర్టు దిక్కరణ కేసు పెడతామాని, రాజధాని రైతులు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి మాత్రం, ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎక్కడ నుంచి అయినా పని చేయవచ్చని, దానికి కోర్టులు అనుమతులు అవసరం లేదని, తాము విశాఖ వెళ్లి తీరతాం అని చెప్తున్నారు. మరి న్యాయస్థానాలు ఈ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read