ఒక పక్క ఏపి ప్రభుత్వం పెట్టిన రాజద్రోహం కేసు, సంచలనం అవుతున్న నేపధ్యంలో, ఇదే తరహా కేసు పై, సుప్రీం కోర్టు ఈ రోజు సంచలన తీర్పు ఇచ్చింది. ఇటీవల ప్రభుత్వాల పని తీరు, లోపల పట్ల ప్రశ్నిస్తున్న జర్నలిస్టుల పైన పలు చోట్ల రాజద్రోహం కేసులు నమోదు చేయటం, వారిని అరెస్ట్ చేయటం పైన, ఇలాంటి నిరంకుశ చర్యల పై దేశ వ్యాప్త చర్చ జరుగుతుంది. తాజాగా వినోద్ దువా అనే జర్నలిస్ట్ పై హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన రాజద్రోహం కేసు విషయంలో సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గత ఏడాది క-రో-నా ప్రారంభం అయిన తరువాత, దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రారంభించటం, ఆ పరిణామాలు ఆలోచన చేయకుండా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ప్రజలు పడిన ఇబ్బందులు తీరు, ఇలా అనేక అంశాలు, లోపాలు పై, వినోద్ దువా అనే జర్నలిస్ట్ తన అభిప్రాయాలు తెలియ చేస్తూ ఒక వీడియో చేసారు. అయితే దేశ వ్యాప్తంగా ప్రభుత్వ చర్యల పై ప్రజల్లో అనుమానం కలిగే విధంగా, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ప్రయత్నం చేసారు అంటూ, ఆయన పై హిమాచల్ ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేసి, పలు సెక్షన్ లు కింద వినోద్ దువా పై కేసులు పెట్టారు. ముఖ్యంగా 124 ఏ అనే సెక్షన్ కింద రాజద్రోహం కేసు పెట్టారు. దాంతో పాటుగా, పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసుతో పాటుగా, ఆయన పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు.

sc 03062021 2

అయితే ఒక జర్నలిస్ట్ పై రాజద్రోహం కేసు మోపటం, ఇతర సాకులు చెప్పి ఆయన్ను అరెస్ట్ చేయటం పై, వినోద్ దువా హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుని, అలాగే ఆ తరువాత సుప్రీం కోర్టుని కూడా ఆశ్రయించటం జరిగింది. 2020 మార్చ్ లో నమోదు చేసిన ఈ కేసు పైన, 2020 జూన్ లోనే సుప్రీం కోర్టు, వినోద్ దువా ని అరెస్ట్ చేయటానికి వీలు లేదని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ రోజు సుప్రీం కోర్టు, ఈ అంశం పై తుది తీర్పు ఇచ్చింది. జస్టిస్ లలిత్ తో కూడిన ధర్మాసనం, ఈ కేసులో తీర్పు ఇచ్చింది. రాజద్రోహం కేసు ఎఫ్ఐఆర్ ని కొట్టేస్తూ, సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రతి జర్నలిస్ట్ కు రక్షణ ఉంటుంది అంటూ సుప్రీం కోర్టు తెలిపింది. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని ఈ సందర్భంగా ఉదహరించింది. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో నమోదు అయిన రాజద్రోహం కేసు విషయంలో, మీడియా పై పెట్టిన రాజద్రోహం కేసు కూడా సుప్రీంలో విచారణలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో, ఆ కేసులో కూడా న్యాయం జరుగుతుందని, విమర్శలు చేస్తే రాజద్రోహం కింద ప్రభుత్వాలు చూడటం మానుకోవాలని విశ్లేషకులు అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read