హైదరాబాద్ సిబిఐ కోర్టులో జగన్ బెయిల్ ని రద్దు చేయాలని చెప్పి,నర్సాపురం ఎంపి రఘురామకృష్ణం రాజు వేసిన పిటీషన్ పై, మూడు వాయిదాల అనంతరం ఈ రోజు, జగన్ మోహన్ రెడ్డి తరుపున కౌంటర్ దాఖలు చేసారు. అదే విధంగా సిబిఐ కూడా తమ కౌంటర్ దాఖలు చేసింది. అయితే జగన్ దాఖలు చేసిన కౌంటర్ లో ప్రధానంగా ఎనిమిది విషయాలు పేర్కొన్నారు. ఇది ప్రభుత్వానికి, ఒక వ్యక్తికి మధ్య జరుగుతున్న ఈ కేసులో, మూడో వ్యక్తి జోక్యం చేసుకోకూడదు అంటూ, గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులను పేర్కొన్నారు. రఘురామకృష్ణం రాజు తమ పార్టీకి చెందిన వ్యక్తి అని, ఆయన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటంతో, ఆయన్ను బహిష్కరించాలని లోకసభ స్పీకర్ కు కూడా ఫిర్యదు చేసామని, వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం, స్వార్ధం కోసమే, ఆయన న్యాయ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు. ఇక మరో అంశంగా, జగన్ విచారణ హాజరు కావటం లేదు అనే దానికి కౌంటర్ ఇస్తూ, తాను ముఖ్యమంత్రిగా ఉండటం, ప్రస్తుతం క-రో-నా ఎక్కువగా ఉండటం వలన, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని, అందుకే బిజీగా ఉంటున్నారని, కోర్ట్ అనుమతితోనే హాజరు కావటం లేదని తెలిపారు. రఘురామకృష్ణం రాజు నేర చరిత్ర కూడా ఉందని, ఆయన పై ఉన్న కేసులు కోర్టుకు తెలియచేయలేదని మరో అంశాన్ని కూడా పేర్కొన్నారు.

cbi 01062021 2

ఈ కేసులతో పాటుగా, బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టటంతో, ఆయన పై సిబిఐ కేసులు కూడా ఉన్నాయని కూడా కౌంటర్ లో తెలిపారు. దీంతో పాటుగా, ఎంపీ విజయసాయి రెడ్డి, అయోధ్యరామ రెడ్డి లాంటి వారి పేర్లను రఘురామరాజు చెప్పటం పై అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇక కేసుల్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లను జగన్ వద్ద పెట్టుకున్నారు అని చెప్పిన విషయం పై కూడా అభ్యంతరం తెలిపారు. మొత్తం 98 పేజీలు  కౌంటర్ వేయగా, అందులో 80 పేజీల వరకు రఘురామరాజు కేసులు పైనే ఉండటం గమనించాల్సిన విషయం. ఇది ఇలా ఉండగా, ఇక్కడ సిబిఐ వేసిన కౌంటర్ చూసి చాలా మంది షాక్ తిన్నారు. కేవలం ఒకే ఒక లైన్ లో సిబిఐ కౌంటర్ వేస్తూ, చట్ట ప్రకారం, కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమే అంటూ, తప్పించుకునే ధోరణిలో సిబిఐ కౌంటర్ వేయటం పై, పలువురు అభ్యంతరం తెలిపారు. ఇదే విషయం పై, రఘురామ రాజు లాయర్ కూడా, సిబిఐ వాస్తవాలు ఏమి చెప్పకుండా, ఇలా కౌంటర్ వేయటం ఏమిటి అని కోర్టు దృష్టికి తేవటంతో, మీ అభ్యంతరాలు కౌంటర్ రూపంలో ఇవ్వాలని ఆదేశిస్తూ, కేసుని 14వ తేదీకి వాయిదా వేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read