కృష్ణపట్నం ఆ-నం-ద-య్య మళ్ళీ అదృశ్యం అయ్యారు. పది రోజుల తరువాత, తన సొంత ఇంటికి వచ్చిన ఆ-నం-ద-య్య, కొన్ని గంటల్లోనే మళ్ళీ అదృశ్యం అయ్యారు. ఆ-నం-ద-య్య నిన్న తన స్వగ్రామానికి వచ్చారు. అయితే ఆయన ఎక్కడ నుంచి వచ్చారో, ఎవరిని నుంచి తప్పించుకుని వచ్చారో తెలియదు. విషయం తెలుసుకుని పోలీసులు గ్రామానికి వచ్చారు. అయితే గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకోవటంతో, ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మీరు బయట ఉండటం మంచిది కాదని, సురక్షిత ప్రాంతానికి తీసుకుని వెళ్తామని పోలీసులు చెప్పారు. అయితే దానికి ఆయన భార్య సమాధానం చెప్తూ, మా అయన మం-దు తాయారు చేయరని, ఇంట్లోనే ఉంటారని చెప్పారు. అక్కడ ప్రజలు కూడా ఆయన్ను తీసుకుని వెళ్ళటానికి వీలు లేదని, మేము కాపాడుకుంటామని చెప్పారు. అయితే పెద్ద ఎత్తున ప్రజలు రావటంతో, తాను ఇక ఎక్కడికీ వెళ్లనని, ప్రభుత్వం అనుమతి రాగానే మం-దు ఇస్తానని చెప్పారు. దీంతో అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అయితే ఈ రోజు తెల్లవారు జామున పోలీసులు వచ్చి, ఆయన్ను తీసుకుని, రహస్య ప్రాంతానికి తరలించారు. ఆయనను పోలీసులు ఎక్కడికి తీసుకుని వెళ్ళారో కూడా చెప్పలేదు. దీంతో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసారు.
అసలు ఇలా ఎందుకు చేస్తున్నారో అర్ధం కావటం లేదని, ఆ ఇచ్చే భద్రత ఏదో ఇంటి దగ్గరే ఇవ్వొచ్చు కదా అని, కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఆయన్ను ఎక్కడకు తీసుకుని వెళ్ళారో చెప్పాలని, తమ వద్దకు తీసుకుని రావాలని డిమాండ్ చేస్తున్నారు. మరో పక్క ఈ అంశం పై తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఆయన్ను ఎందుకు వేదిస్తుందో అర్ధం కావటం లేదని అన్నారు. ఆయన మందు పై ఎందుకు వాస్తవాలు దాచి పెడుతున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. ఎవరి కోసం మం-దు పంపిణీ ఆపెసారో చెప్పాలని, అసలు ఈ విషయంలో ఎందుకు వైసీపీ నేతలు జోక్యం చేసుకుంటున్నారో చెప్పాలని అన్నారు. అసలు చెవిరెడ్డికి, ఈ ఆయుర్వేద మం-దు-కి ఏమి సంబంధం ఉందో చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ మం-దు తో వైసీపీ నేతలు వ్యాపారం చేసుకుంటున్నారని అన్నారు. ప్రజలకు చెందాల్సిన ఈ మందుని, వైసిపీ నేతలు తమ స్వార్ధానికి వాడుకుంటున్నారని అన్నారు.