తిరుపతి రుయా హాస్పిటల్ లో, 15 రోజులు క్రితం జరిగిన దా-రు-ణ-మై-న సంఘటన అందరినీ కలిచి వేసిన సంగతి తెలిసిందే. చెన్నై నుంచి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ లేట్ గా రావటంతో, తిరుపతి రుయా హాస్పిటల్ లో ఆక్సిజన్ పై చికిత్స పొందుతున్న అనేక మంది రోగులు ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. చివరకు ఆక్సిజన్ సరఫరాలో దాదాపుగా 40 నిమిషాల పాటు, అంతరాయం కలగటంతో, కొంత మంది రోగులు అక్కడికక్కడే చ-ని-పో-యా-రు. అయితే ప్రభుత్వం మాత్రం కేవలం 11 మంది మాత్రమే చ-ని-పో-యా-ర-ని ప్రకటన చేసింది. అయితే ప్రత్యక్ష సాక్ష్యులు మాత్రం, 50 మందికి పైగానే చ-ని-పో-యి ఉంటారని చెప్పారు. దానికి తగ్గట్టుగానే అక్కడ ఉన్న ప్రతిపక్షాలు కూడా, పేర్లుతో సహా దాదాపుగా 53 మంది పేర్లు, ఆ రోజు చ-ని-పో-యిన వారి పేర్లు చెప్పాయి. ఈ వివాదం ఇలా కొనసాగుతూనే వచ్చింది. అయితే , ఇది ప్రభుత్వ తప్పిదం వల్ల జరిగిన ఘటన కావటంతో, ప్రభుత్వం వైపు నుంచి చ-ని-పో-యి-న వారికి పరిహారం ఇచ్చారు. ఈ పరిహారాన్ని ఇప్పటికే కొంత మందికి ఇచ్చారు. అయితే మొన్నటి వరకు కేవలం 11 మందే చ-ని-పో-యా-ర-ని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు ఈ జాబితాలో మళ్ళీ మరో 12 మందిని చేర్చింది. దీంతో, మొత్తం మృతులు సంఖ్య 23కి చేరుకుంది.

ruya 27052021 2

ఇది అధికారికంగా విడుదల చేసన లెక్క. దీని పై స్పందించిన రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భారతి, ఘటన జరిగిన సమయంలో, అప్పట్లో కేవలం 11 మంది మాత్రమే చ-ని-పో-యా-ర-ని, అయితే తరువాత ఇదే కారణం చేత ఇబ్బంది పడిన మరో 12 మంది వరకు చ-ని-పో-యా-ర-ని, కలెక్టర్ ఆ జాబితా కూడా ఇవ్వమని కోరటంతో, తాము ఆ జాబితా కూడా పమించామని, మొత్తంగా చ-ని-పో-యి-న ఆరి సంఖ్య 23కు చేరుకుందని అన్నారు. అయితే ఇంకా కొంత మంది, తమ వారు కూడా అదే రోజు, ఇదే సమస్యతో పోయారని, మాకు కూడా పరిహారం అందించాలని, తమకు న్యాయం చేయాలని కన్నీటిపర్యంతం అయ్యారు. ఇక ప్రభుత్వం తాజాగా మృతులు సంఖ్య పెంచి చెప్పటంపై, ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి. తాము మొదటి నుంచి, ఈ సంఖ్య ఎక్కువ ఉంటుందని చెప్తుంటే, తమ పై ఎదురు దాడి చేసారని, ఇప్పుడు ప్రకటించారని, తాము చెప్పిందే నిజం అయ్యిందని, ఇంకా ఈ సంఖ్య ఎక్కువ ఉంటుందని, అందరికీ న్యాయం చేయాలని, వారు కోరుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read