ఎంపీ రఘురామకృష్ణం రాజు అరెస్ట్ తీరు పైన, ఆ తరువాత ఆయన పై కస్టడీలో చి-త్ర-హిం-స-లు పెట్టటం పైన, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సీరియస్ అయ్యింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అంతే కాకుండా, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇన్ హౌస్ దర్యాప్తుకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ హోం సెక్రటరీకి, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీలకు ఈ నోటీసులు జారీ చేసింది. దీని పై నాలుగు వారాల్లోగా తమకు నివేదికను ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. అంతే కాకుండా, తమ సొంతగా కూడా అంతర్గత విచారణ జరపటానికి సిద్ధం అయ్యింది. జూన్ 7లోగా ఈ నివేదిక కూడా ఇవ్వాలని ఆదేశించింది. రఘురామకృష్ణం రాజుకి చెందిన మొత్తం ఎపిసోడ్ పై, ఆయన కుమారుడు భరత్ తో పాటుగా, పలువురు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేసారు. వాటిని పరిగణలోకి తీసుకున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, వాటిని సీరియస్ గా తీసుకుంది. ఎన్‌హెచ్ఆర్సీకి ఇచ్చిన ఫిర్యాదులో, ఫిర్యాదు దారులు అనేక అంశాలు పేర్కొన్నారు. ఆయన పుట్టిన రోజున అరెస్ట్ చేసి, చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేసారని, రాజ్యాంగ ఉల్లంఘనకు కూడా పాల్పడ్డారని, తాము ఇచ్చిన పిటీషన్ లో, ఎన్‌హెచ్ఆర్సీ కి తెలిపారు.
ఆయన సిట్టింగ్ ఎంపీ అని, అయినా పార్లమెంట్ స్పీకర్ అనుమతి కూడా లేకుండా, ఆయన్ను అరెస్ట్ చేసి, హైదరాబాద్ నుంచి గుంటూరు తీసుకుని వెళ్ళారని, అలాగే కస్టడీకి తీసుకుని, ఆయన కా-ళ్ళ పై కొ-ట్ట-టం, మందులు సరిగ్గా ఇవ్వక పోవటం, రాత్రంతా కూడా ఆయన నిద్ర పోకుండా చేసి, మానసిక హిం-స-కు పాల్పడ్డారని, బౌతికంగా ఇబ్బంది పెట్టారని, ఆయనకు హార్ట్ ఆపరేషన్ జరిగిందని తెలిసినా, కావాలని ఇబ్బంది పెట్టారని, ఆ పిటీషన్ లో అన్ని అంశాలు పేర్కొన్నారు. మజిస్త్రేట్ కోర్ట్ కూడా, ఆయన కాళ్ళకు ఉన్న గా-యా-ల పై రికార్డు చేసారని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారం పైన విచారణ జరిపించాలని, ఏపిలో మానవ హ-క్కు-ల ఉల్లంఘన జరుగుతుందని, రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, ఈ విషయం పై తమకు న్యాయం చేయాలి అంటూ, పిటీషనర్ లు, ఎన్‌హెచ్ఆర్సీ కి ఫిర్యాదు చేసారు. ఈ అంశాన్ని సీరియస్ గా పరిగణలోకి తీసుకున్న ఎన్‌హెచ్ఆర్సీ, మొత్తం అంశం పై తమకు నివేదిక ఇవ్వాలి అంటూ, ఏపీ డీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు నోటీసులు ఇచ్చింది.