అమరావతి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటూ, ప్రభుత్వం వేసిన పిటీషన్ ని, నిన్న సుప్రీం కోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. అయితే దీని పై ఈ రోజు సుప్రీం కోర్టు పూర్తి తీర్పు అందుబాటులోకి వచ్చింది. ఈ తీర్పు కాపిలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సుప్రీం కోర్టు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుని, సుప్రీం కోర్టు సమర్ధించింది. న్యాయమూర్తులు వినీత్ శరన్, దినేష్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం నిన్న ఈ తీర్పు ఇచ్చింది. హైకోర్టు అన్ని వాస్తవాలను పరిశీలించిన తరువాతే, ఎఫ్ఐఆర్ ను కొట్టేసిందని, ఈ తీర్పులో చట్ట విరుద్ధమైన అంశాలు ఏమి లేవని, అన్ని కోణాలను హైకోర్ట్ పరిగణలోకి తీసుకుందని సుప్రీం కోర్టు తీర్పులో తెలిపింది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, రాజధాని ఎక్కడ అన్నది రహస్యం ఏమి కాదని, అది అందరికీ తెలిసిన విషయమే అని, పబ్లిక్ డొమైన్ లో ఎప్పటి నుంచో ఉందని, భూములు అమ్మిన వారికి నష్టం జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పింది. కొనుగోలు దారులు మోసం చేసారు అనే వాదనలకు కూడా ఎక్కడా ఆధారాలు లేవని చెప్పింది. ప్రైవేటు వ్యక్తుల మధ్య ఈ వ్యవహారం మొత్తం జరిగిందని, ప్రభుత్వ అధికారుల మీద కేసు పెట్టాలి అనే వాదనలో పస లేదని తెలిపింది. అంతే కాకుండా దర్యాప్తును ప్రాధమిక స్థాయిలో హైకోర్టు అడ్డుకుందని, ఆ అధికారం హైకోర్టుకు లేదనే వాదనను కూడా సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.

amaravati 20072021 2

హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఎలాంటి తప్పు లేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. అంతే కాకుండా, ట్రాన్స్ఫర్ అఫ్ ప్రాపర్టీ ఆక్ట్ అనేది కూడా ఇక్కడ రాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఎఫ్ఐఆర్ లు ఏవైతే దాఖలు అయ్యయో, ఆ ఎఫ్ఐఆర్ లు అన్నిటినీ కూడా పరిశీలించిన తరువాతే, హైకోర్టు అన్ని లావాదేవీలు పరిశీలించి, ప్రభుత్వం ఉద్దేశాలు, దురుద్దేశాలు పరిశీలించిన తరువాతే, ఈ కేసుని కొట్టివేయటం జరిగిందని, ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదమే ఇక్కడ వర్తించదు అనే హైకోర్ట్ వ్యాఖ్యలతో సుప్రీం ఏకీభవించింది. ఇక మరో అంశం సుప్రీం కోర్టు లేవనెత్తింది, టైం అంశం. ఇది అంతా 2014లో జరిగితే, ఇప్పటి దాకా ఏమి చేసారు అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఆరేళ్ళ వరకు ఎందుకు సమయం వృధా చేసారు అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. అయితే ప్రభుత్వం మారిన తరువాత మాకు ఈ అవినీతి విషయం తెలిసింది అని ప్రభుత్వ తరపు లాయర్ చెప్పటంతో, కోర్టు ఇందులోని దురుద్దేశాన్ని గుర్తించిందనే చెప్పాలి. మొత్తానికి హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్ధిస్తూ, సుప్రీం కేసుని కొట్టేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read