సుప్రీం కోర్టు భారీ షాక్ ఇచ్చింది. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళటం, అక్కడ హైకోర్టు కేసు కొట్టేసిన విషయం తెలిసిందే. అయితే దీని పై ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. అయితే ఈ రోజు సుప్రీం కోర్టు ఏపి ప్రభుత్వానికి భారీ షాక్ ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ను సుప్రీం కోర్టు సమర్ధించింది. ఏపి ప్రభుత్వం వేసిన పిటీషన్ ను సుప్రీం కోర్టు కొట్టేసింది. వినీత్ శరన్ ధర్మాసనం కొద్ది సేపటి క్రితం తీర్పు ఇచ్చింది. ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీం కోర్టు సమర్ధించింది. ఏపి ప్రభుత్వం తరుపున దుష్యంత్ దవే సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. అలాగే అమరావతి వాసుల తరుపున ఖుర్షీద్, శ్యాం దివాన్ వాదనలు వినిపించారు. హైకోర్టు పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తరువాతే, హైకోర్టు ఈ తీర్పు ఇచ్చిందని, హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్ధిస్తున్నామని వినీత్ శరన్ ధర్మాసనం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున వాదనలు వినిపిస్తూ, రాజధాని అక్కడ వస్తుందని వారికి ముందే తెలుసని, నోటిఫికేషన్ రాకముందే అక్కడ భూములు కోనోగోలు చేసారని, ఈ కొనుగోలు చేసిన వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు, అధికారులతో కుమ్మక్కు అయ్యి, అమ్మకం దారులను మోసం చేసి, ఈ కొనుగోళ్ళు జరిగాయని, ట్రాన్స్ ఫర్ ఆఫ్ ప్రాపర్టీ చట్టం కింద కేసు పెట్టాలని అన్నారు.

sc 19072021 2

2019 ముందు వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ప్రభుత్వం మారిన తరువాతే ఫిర్యాదు చేసారని అన్నారు. అయితే ప్రతివాద న్యాయవాదులు దీన్ని విభేదించారు. ఇప్పటికీ అమరావతిలో అక్రమాలు జరిగాయని ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదని అన్నారు. ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదని, ఇది ప్రభుత్వం కక్ష సాధింపు అని అన్నారు. ఈ కేసులో కేసులో ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీస్ చట్టం రాదని వాదించారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత నుంచి, కధనాలు వస్తూనే ఉన్నాయని అన్నారు. రాజధానిపై 2014 డిసెంబరు 30న ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని కోర్టుకు తెలిపారు. ఇక మరో న్యాయవాది శ్యామ్ దివాన్ కూడా వాదనలు వినిపిస్తూ, హైకోర్టు ఇవన్నీ పరిశీలించిన తరువాతే తీర్పు ఇచ్చిన విషయాన్నీ గుర్తు చేసారు. రాజధాని ఏర్పాటు బహిరంగ రహస్యం అని అన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు, అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అనే అంశం ఇందులో లేదని, హైకోర్టు వాదనను సమర్ధిస్తూ, ఈ కేసుని కొట్టేసింది. అంటే ఇక ఇన్సైడర్ ట్రేడింగ్ అనే ఆరోపణలు ఈ విషయంలో ఎవరూ నమ్మే పరిస్థితి ఉండదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read