జగన్ క్యాంప్ ఆఫీస్ ముట్టడించారు అంటూ, అప్పట్లో విద్యార్ధి నాయకుల పై రేప్ కేసు పెట్టి, ఆ రిపోర్ట్ ని కోర్టులో చూపించి, న్యాయమూర్తి చీవాట్లతో దాన్ని సరిచేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఇది పెద్ద సెన్సేషన్ అయ్యింది. అదే విధంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి కూడా గురయ్యేలా చేసిన సంఘట ఇది. అయితే ఇప్పుడు కూడా విద్యార్ధి నాయకుల పెట్టిన కేసు చూస్తే ఇంచుమించు ఇలాగే చర్చించుకుంటున్నారు. సోమవారం నాడు, జాబ్ క్యాలండర్ కు వ్యతిరేకంగా విద్యార్ధి సంఘాలు సియం ఇంటి ముట్టడికి పిలుపు ఇచ్చాయి. అయితే ఈ నిరసనలో పాల్గున్న వారి పై, మారణాయుధాలు ఉపయోగించారు అంటూ కేసు పెట్టారు. అయితే అవేమీ లేవు కదా, అసలు ఎందుకు పెట్టారు అనుకుంటే, జెండాకి కర్ర ఉంది కాబట్టి, మారణాయుధాలు ఉపయోగించారు అని కేసు పెట్టారు అని తేలింది. అయితే దీని పై తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు స్పందించారు . ఆయన స్పందిస్తూ, "ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అడిగిన నిరుద్యోగులపై కేసులు పెట్టారు.. రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగులను మోసం చేసిన జగన్ రెడ్డిపై ఏం కేసులు పెట్టాలి.? నిరుద్యోగులు ప్రశ్నించడమే నేరమైతే మోసగించిన జగన్ రెడ్డిని ఏమనాలి.? 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 10,143 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులను అవమానించారు. నిరుద్యోగుల చేతిలో ఉన్న జెండాలు మారణాయుధాలుగా కనబడుతున్నాయా జగన్ రెడ్డి.? 10,143 పోస్టులతో ఉద్యోగాల విప్లవం ఎలా వస్తుందో సమాధానం చెప్పాలి. "
"వైసీపీలోని రాజకీయ నిరుద్యోగులకు నామినేటెడ్ పోస్టుల ద్వారా రాజకీయ ఉద్యోగాలను జగన్ రెడ్డి కల్పించారు. 2 లక్షల 30 వేల ఉద్యోగాలు ఇచ్చేంతవరకు ఉద్యమం ఆగదు. మీరు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే అరెస్టులు చేసి, కేసులు పెడతారా..? మీరు పెట్టే అక్రమ కేసులకు వెనుకాడేది లేదు. రెట్టింపు ఉత్సాహంతో మరోమారు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి తీరుతాం. నేను విన్నాను, నేను ఉన్నాను, నేను చూశాను అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారంలో గగ్గోలు పెట్టి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను ఘోరంగా మోసం చేశారు. ఇచ్చిన వాగ్ధానాన్ని గుర్తు చేసిన నిరుద్యోగులపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి హింసిస్తోంది. విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులపై ఈనెల 19న నమోదైన ఎఫ్ఐఆర్ లో ఉన్న ప్రతి మాట, ప్రతి సెక్షన్ ముమ్మాటికీ తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ నుండి వచ్చినవే. తప్పుడు కేసులతో నిరుద్యోగ, విద్యార్థి శక్తిని అడ్డుకోలేరు. 2 లక్షల30 వేల పోస్టులతో నూతన జాబ్ క్యాలెండర్ వచ్చేవరకు ఉద్యమించి తీరుతాం. జగన్ రెడ్డి ఫాసిస్టు నిర్బంధ చర్యలతో నిరుద్యోగ, విద్యార్థి, యువజన నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు."