వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మధ్య ఉన్న వైరం బయట పడిన సంఘటన ఇది. వైసీపీ నేత అయిన లక్ష్మీ పార్వతికి గుంటూరు జిల్లాలో ఒక పొలం ఉంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం దూళిపాళ్లలో లక్ష్మీపార్వతిని దాదాపుగా రెండున్నర ఎకరాల పొలం ఒకటి ఉంది. అయితే ఇప్పుడు ఈ పొలం వివాదంలో ఉండటంతో, ఇది రచ్చకు ఎక్కింది. ఇక వివరాల్లోకి వెళ్తే, గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఉన్న ఈ లక్ష్మీపార్వతికి చెందిన పొలాన్ని, సత్తెనపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు కోటేశ్వరరావు చూసుకుంటూ ఉంటారు. లక్ష్మీపార్వతి హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి, ఆవిడకు చెందిన పొలం బాధ్యత మొత్తం ఈయన చూస్తారు. మరి ఆమె వైసీపీ, ఈయన బీజేపీ కదా అనే అనుమానం రావచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ, వైసీపీ మధ్య ఉన్న బంధం అందరికీ తెలిసిందే కదా, అందుకే వైసీపీ నేత అయినా సరే, సత్తెనపల్లిలో వైసీపీ వాళ్ళు ఎవరూ లేనట్టు, ఈ పొలం తీసుకుని వెళ్లి బీజేపీ వాళ్ళ చేతిలో పెట్టారు. అయితే అక్కడ సత్తెనపల్లి ఎమ్మెల్యే మాత్రం, వైసీపీలో ప్రముఖ నాయకుడు అయిన అంబటి రాంబాబు గారు. మరి అక్కడ అంత ఫేమస్ పర్సనాలిటీ ఉన్నా, లక్ష్మీపార్వతి గారు, ఆవిడ పొలం బాధ్యతలు బీజేపీ నేత చేతిలో పెట్టారు అంటే, వైసీపీ మీద ఎంత నమ్మకోమో అర్ధమవుతుంది కదా.

lp 21072021 2

అయితే ఈ పొలంలో ప్రభుత్వ పధకం అయిన, జలకళ ద్వారా బోరు వేయించాలని లక్ష్మీపార్వతి, కోటేశ్వరరావుకు చెప్పారు. మరి పేదలకు చెందాల్సిన ఇలాంటి పధకాలు కూడా నేతలు వేసుకోవటం మరో హైలైట్. అయితే జలకళ పధకం ద్వారా బోరు వేయాలి అంటే స్థానిక ఎమ్మెల్యే అనుమతి కావాలి కాబట్టి, అంబటిని కలవమని లక్ష్మీపార్వతి, కోటేశ్వరరావుకు చెప్పారు. అయితే స్థానిక వైసీపీ నేతలు అడ్డుపడుతున్నారు అంటూ, కోటేశ్వరరావు అనే వ్యక్తి అంబటికి ఫోన్ చేసి చెప్పారు. దీనికి స్పందించిన అంబటి, లక్ష్మీ పార్వతి పొలం విషయం గురించి తనతో మాట్లాడవద్దని చెప్పగా, ఇలా స్పందించటం కరెక్ట్ కాదని, మీ పై జగన్ గారికి, గవర్నర్ గారికి ఫిర్యాదు చేస్తానని, కోటేశ్వరరావు చెప్పగా, జగన్ కు గవర్నర్ కు కాకపొతే, ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి చెప్పుకో అని అంబటి బదులు ఇచ్చారు. అయితే ఆ బీజేపీ నేత, ఈ ఫోన్ సంభాషణను సోషల్ మీడియాలో పెట్టటంతో ఇది వైరల్ అయ్యింది. అయితే ఈ విషయం పై ఇంకా లక్ష్మీ పార్వతి అయితే స్పందించలేదు. బీజేపీ నేత కోటేశ్వరరావు మాత్రం, అంబటి నన్ను బెదిరిస్తున్నాడు అంటూ మీడియాకు ఎక్కారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read