జగన్ మోహన్ రెడ్డి పై ఉన్న 11 కేసులు విత్ డ్రా చేసుకోవటం పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. క-రో-నా లాక్ డౌన్ వన్ లో నిబంధనలకు విరుద్ధంగా గుంటూరు జిల్లా, అనంతపురం జిల్లాలో కేసులు విత్ డ్రా చేసుకోవటం పై, హైకోర్టు సుమోటోగా కేసు తీసుకున్న సంగతి తెలిసిందే. దీని పై ఈ రోజు హైకోర్టులో విచారణ కొనసాగింది. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ, జగన్ పై కేసులు విత్ డ్రా చేసుకోవటం పై విచారణ నిర్వహించటం, ఆ విచారణ ఆధారంగా హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసింది. క్రిమిననల్ రివిజన్ పిటీషన్ పై బుధవారం విచారణ జరగగా, ప్రతివాదులు అందరికీ నోటీసులు ఇస్తాం అని హైకోర్టు చెప్పింది. అయితే ప్రభుత్వం తరుపున అడ్వొకేట్ జనరల్ మాత్రం, అసలు ఈ కేసులు విచారణ అర్హం కాదని, నోటీసులు ఇవ్వటానికి వీలు లేదని, అడ్మినిస్ట్రేటివ్ కమిటీ న్యాయ పరమైన అంశాల పై ఎలా చెప్తుందని వాదించారు. అలాగే సుప్రీం కోర్టు తీర్పులు కూడా కొన్ని చెప్పారు. హైకోర్టు ఇలా క్రిమినల్ రివిజన్ పిటీషన్ సుమోటో గా తీసుకోవటం, దేశంలోనే మొదటి సారని, ఇంత వరకు ఎప్పుడు జరగలేదని వాదించారు. ఈ నేపధ్యంలో కేసు విచారణను ఈ రోజు కూడా హైకోర్టు వాయిదా వేసింది. అయితే ఈ రోజు కొద్ది సేపటి క్రితం, మళ్ళీ ఈ కేసుకు సంబంధించి విచారణ మొదలైంది.

jagan 25062021 21

విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి కె.లలిత ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ కమిటీ జగన్ కేసులు విత్ డ్రాకి సంబంధించి దర్యాప్తు చేసి, నివేదిక ఇచ్చిందో, ఆ నివేదికను సీల్డ్ కవర్ లో కోర్టు ముందు ఉంచాలని ఆదేశాలు జారీ చేసారు. ఆ నివేదికను పూర్తిగా స్టడీ చేసిన తరువాత, తాము పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేస్తామని కోర్టు తెలిపింది. ఈ నివేదిక, సీల్డ్ కవర్ లో రిజిస్టరీ నుంచి అందిన తరువాత, ఆ నివేదకను పూర్తిగా స్టడీ చేసిన తరువాత, ఈ రోజు కానీ, రేపు కానీ ఈ అంశం పై పూర్తి స్థాయిలో ఆదేశాలు వచ్చే అవకాసం కనిపిస్తుంది. మొన్న జరిగిన విచారణలో అడ్వొకేట్ జనరల్ జరిపిన వాదనలు, ఈ రోజు అడ్మినిస్ట్రేటివ్ కమిటీ రిపోర్ట్ ఇంకా రిపోర్ట్స్ లోకి రాకపోవటంతో, అవి రికార్డుల్లోకి వచ్చిన తరువాత, తాము తగిన ఆదేశాలు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే దీని పై ఈ రోజు కానీ, రేపు కానీ, తగిన ఆదేశాలు వచ్చే అవకాసం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఒక ప్రభుత్వాధినేతగా ఉంటూ, తన పైన కేసులు కొట్టేయించుకోవటం పై విమర్శలు వస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read