సీనియర్ ఐపిఎస్ అధికారి, గత ప్రభుత్వ హయంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేసిన ఏబి వెంకటేశ్వరరావు పై, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే అసలు ఎక్కడా కొనుగోళ్ళు జరగకుండానే, ఏమి లేకుండానే తన పై కక్ష సాధింపు చేస్తున్నారు అంటూ, ఏబి వెంకటేశ్వర రావు, ప్రభుత్వ సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ, హైకోర్టుకు ఎక్కారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్ట్, ఆయన సస్పెన్షన్ ఎత్తివేసి, ఆయనకు ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న జీతం కూడా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, ఈ విషయాన్ని ప్రతిష్టగా తీసుకుని, హైకోర్టు ఇచ్చిన సస్పెన్షన్ రద్దు ఉత్తర్వులు ఎత్తివేయాలి అంటూ, సుప్రీం కోర్టు మెట్లు ఎక్కింది. దీనికి సంబందించిన విచారణ, జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే ఈ కేసు విచారణ తన ముందుకు రావటంతో, ఈ కేసు విచారణ నుంచి తాను వైదొలుగుతున్నట్టుగా జస్టిస్ లావు నాగేశ్వరరావు చెప్పారు. ఈ కేసు నాట్ బిఫోర్ మీ అంటూ, ఈ కేసుని వేరే బెంచ్ కు విచారణకు తీసుకుంటే బాగుటుందని తప్పుకున్నారు. శీతాకాల సమావేశాలు తరువాత అంటే, దీపావళి తరువాత, ఈ కేసు వేరే బెంచ్ ముందుకు వచ్చే అవకాసం కనిపిస్తుంది.

sc 03112020 2

అయితే ఈ పరిణామం పై ఎందుకు నాట్ బిఫోర్ అన్నారు అనే విషయం పై కారణాలు అయితే చెప్పలేదు. లావు నాగేశ్వరరావు గుంటూరు జిల్లా పెదనందిపాడు గ్రామానికి చెందిన వారు. అంచెలంచెలుగా ఎదిగి, సుప్రీం కోర్టు జస్టిస్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం, ఏకంగా సుప్రీం కోర్టు జడ్జిల పై, కాబోయే చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా పైనే , వివిధ ఆరోపణలు ఆపాదించి, అలాగే వైసీపీ పార్టీ సోషల్ మీడియా, కులం పేరుతో జడ్జిలను అల్లరి చేస్తున్న నేపధ్యంలో, ఆ వాతావరణం, ఆంధ్రప్రదేశ్ లో ఉండటంతో, అనవసర చర్చ ఎందుకు అనుకున్నారో ఏమో కానీ, జస్టిస్ లావు నాగేశ్వరరావు ఈ కేసు నుంచి తప్పుకున్నారు. గతంలో ఏపి, తెలంగాణా నుంచి వచ్చిన అనేక కేసుల్లో విచారణ జరిపారు, కానీ ఈ కేసులో మాత్రం, తప్పుకున్నారు. ఒక విధంగా ఇదే మంచిది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే, కేసు merits ప్రకారం, హైకోర్టు తీర్పుని సమర్ధించాల్సిన పరిస్థితి వస్తే, రాష్ట్రంలో జడ్జిల పైనే వ్యక్తిగతంగా అల్లరి చేస్తున్న పరిస్థితిలో, ఇది సరైన నిర్ణయంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read