నెల్లూరు జిల్లా, గూడూరు నియోజవర్గంలో వైసిపీలో వర్గ విబేధాలు తారా స్థాయికి చేరుకున్నారు. ఏకంగా గూడూరు ఎమ్మెల్యే వర ప్రసాద్ ఇంటినే, వైసీపీ నేతలు, కార్యకర్తలు ముట్టడించారు. ఎమ్మెల్యే వరప్రసాద్ పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని, పెద్ద ఎత్తున ఆందోళన చేసారు. ఆయన పైన అవినీతి ఆరోపణలు రావటం కొత్త కాదు. గతంలో ఒక తోళ్ళ పరిశ్రమ ఏర్పాటు విషయంలో, ఆ కంపెనీ యాజమాన్యం నుంచి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారని పెద్ద ఎత్తున ఆందోళన చేసారు. అయితే ఈ సారి మాత్రం, ఏకంగా సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యే పై తిరగబడ్డారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే, గూడూరు ఎమ్మెల్యే పై, రెండు సార్లు తిరుగుబాటు వచ్చింది. గూడూరు ప్రాంత ప్రజలు కూడా , ఏకంగా ఒక ఎమ్మెల్యే పై, అదే పార్టీ నేతలు ఆందోళన చేయటం ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. ప్రధానంగా నాలుగు రోజుల క్రిందట, ప్రభుత్వ సలహదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి, అలాగే ఇంచార్జ్ మంత్రి బాలినేని, జిల్లా మంత్రి అనిల్, ముగ్గురు కలిసి, గూడూరులో ఉన్న నాయకులును, ఎమ్మెల్యేని కూర్చోబెట్టి, వర్గ విబేధాలు మానండి, పార్టీని బజారున పడేయ వద్దు, ప్రత్యర్ధి పార్టీలకు అవకాసం ఇవ్వకండి, ఇప్పటికే పార్టీ పై వ్యతిరేకత వస్తున్న వేళ, మనం మనం కొట్టుకుంటే కష్టం అంటూ, ఇరు వర్గాలకు నచ్చ చెప్పారు.

guduru 04112020 2

అయితే ఆ సమయంలోనే రెండు వర్గాల మధ్య మాటలు యుద్ధం జరిగిందని సమాచారం. అయితే సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రులు బాలినేని, అనిల్ లాంటి వాళ్ళు చెప్పినా, అక్కడ వినే పరిస్థితి లేదు. గూడూరుకి నలుగురు ఎమ్మేల్యేలు ఉన్నారు అంటూ, వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద గూడూరులో నాలుగు వర్గాలుగా ఉండటం, అలాగే అధిష్టానం వీరి పై పట్టు తెచ్చుకోలేక పోవటంతో, ఏకంగా ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి, అవినీతి చేస్తూ, ఇంటి గుట్టు బయట పెట్టుకునే వరకు వచ్చింది. అయితే ఎమ్మెల్యే వరప్రసాద్ మాత్రం, తన పై , పై స్థాయిలోనే కుట్ర జరుగుతుందని వాపోతున్నారు. జగన్ తోనే తేల్చుకుంటాను అంటూ, చెప్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో అవినీతి చేస్తుంటే, కావాలని వరప్రసాద్ ని అల్లరి చేస్తున్నారు అంటూ, వరప్రసాద్ వర్గీయలు వాపోతున్నారు. అయితే వరప్రసాద్ దీని పై ఏమి చేస్తారు ? జగన్ వద్ద తెల్చుకుంటారా, లేక ఏదైనా కఠినమైన నిర్ణయం ఏమైనా తీసుకుంటారా అనేది చూడాలి. మరో పక్క మెజారిటీ నియోజకవర్గాల్లో, వైసీపీలో గ్రూపులు ఎక్కవు అయిపోతున్నాయి. ప్రతి చోట రెండు వర్గాలు, పార్టీని రోడ్డున పడేస్తున్నారు. మరో పక్క, జగన్ మొహన్ రెడ్డి మాత్రం, ఎమ్మెల్యేలకు కానీ, నాయకులకు కానీ అప్పాయింట్మెంట్ ఇవ్వకపోవటం, తరుచూ వాళ్ళతో మాట్లాడకపోవటంతో, గ్యాప్ ఎక్కువ వచ్చేస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read