ఒక్క జిల్లాలో రూ.700 కోట్ల అంటే, రాష్ట్రం మొత్తం ఎంత కుంభకోణం చేసి ఉంటారో చూడండి అంటూ, తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్, కేంద్ర ప్రభుత్వానికి సంచలన లేఖ రాసారు. ఇప్పటి వరకు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియని స్కాం అనే చెప్పాలి. నెల్లూరు జిల్లాలో ధాన్యం సేకరణలో భాగంగా, ఇంత భారీ స్కాం జరిగిందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో, కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌కు లేఖ రాసారు ఎంపీ గల్లా జయదేవ్. దళారులు, కొంత మంది అధికారులు, మిల్లర్లు, వీరి వెనుక ఉన్న బడా నేతల వైఖరి వల్ల, రైతులు అన్యాయం అయిపోతున్నారని వాపోయారు. ఈ మొత్తం వ్యవహారం పై జాతీయ దర్యాప్తు సంస్థల చేత విచారణ జరిపించి, ఈ కుంభకోణం మొత్తాన్ని బయటకు తీయాలని కోరారు. దీనికి ఉదాహరణగా నెల్లూరు జిల్లాలో ఒక రైతు ఖాతాలో 8 లక్షాలు రూపాయలు అదనంగా పడిన విషయాన్ని , తరువాత అతను ఈ విషయం పై ఫిర్యాదు చేస్తే, దాని పై విచారణ చేయకుండా, రైతుని పోలీసులు వచ్చి అరెస్ట్ చేయటం, వంటివి ఈ స్కాంలో ఉన్న మరో కోణం అంటూ, గల్లా వివరించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ ధాన్యం సేకరణ జరుగుతుంది కాబట్టి, ఈ విషయం పై కేంద్రం కూడా చొరవ చూపాలని గల్లా లేఖలో తెలిపారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా రాష్ట్రాల్లో ఉండే సివిల్ సఫ్లై కార్పొరేషన్ ల ద్వారా ధాన్యం సేకరణ చేస్తారు.

piyush 03112020 1

ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఈ సారి 8 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే, కేవలం 3 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే సేకరణ చేసారు. దీనికి కారణం మధ్యవర్తులు, అధికారులు, మిల్లర్లు, బడా నేతలు కలిసి కుంభకోణం చేసారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఇది తెలుగుదేశం ఆరోపణ "మిల్లర్లు, మద్యవర్తులు కనీస మద్దతు ధర కంటే చాలా తక్కువకు రైతులను అధిక మొత్తంలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాకుండా తేమ, తరక నెపంతో తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ మొత్తాలను కొలుచుకున్నారు. లోకల్ అధికారులతో కుమ్మకైన మిల్లర్లు, మధ్యవర్తులు డేటా బేస్ లో బినామి పేర్లను ఎక్కించారు. ఈ-క్రాప్ ప్రొక్యూర్ మెంట్ డేటా బేస్ ను, ఆంధ్రప్రదేశ్ సివిల్ సఫ్లైస్ కార్పొరేషన్ డేటాను, వ్యవసాయ శాఖకు సంబంధించిన పంట మరియు సాగు డేటాను పరిశీలించిన జరిగిన అవకతవకలు బయటపడుతాయి. డేటా బేస్ లోని పొంతనలేని లెక్కలే వరి ధాన్యం కొనుగోళ్లలో భారీ కుంభకోణం చోటుచేసుకుందనడానికి సూచన. ఇలా రైతులకు చెందాల్సిన కనీస మద్దతు ధర పొందిన మిల్లర్లు/మధ్యవర్తులు స్థానిక ప్రొక్యూర్ మెంట్ అధికారులకు వాటాలను చెల్లించారు.
" ఇలా అనేక వివరాలతో కేంద్రానికి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏసిబికి తెలుగుదేశం ఫిర్యాదు చేసింది. మరి ఇందులో నిజా నిజాలు తెలుస్తారా, లేదో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read