ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇప్పటికే న్యాయవ్యవస్థకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ప్రభుత్వం వైపు నుంచి అయితే డైరెక్ట్ గానే విమర్శలు చేస్తున్నారు. ఏకంగా జగన్ మొహన్ రెడ్డి, ఆరుగురు హైకోర్టు జడ్జిల పై చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేసి, ఆ లేఖను కూడా మీడియాకు వదిలిన సంగతి తెలిసిందే. ఇక మరో పక్క కొంత మంది వైసీపీ ప్రజా ప్రతినిధులు, ఏకంగా కోర్టుల పైనే ఆపాదిస్తూ, వ్యాఖ్యలు చేస్తున్నారు. కోర్టులను చంద్రబాబు మ్యానేజ్ చేస్తున్నారు అంటూ, ఏకంగా అసెంబ్లీలోనే జగన్ మోహన్ రెడ్డి పదే పదే చెప్పారు. అయితే కోర్టు మాత్రం, తన ముందు ఉన్న చట్టం, న్యాయం పరిధిలోనే కామెంట్ చేస్తుంది, తీర్పులు ఇస్తుంది. ఎందుకంటే అనేక కేసుల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పులని, సుప్రీం కోర్టు కూడా సమర్ధించింది. ఇది ఇలా ఉంటే ఈ రోజు సిపిఐ నేత నారయణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆయన హైకోర్టు చీఫ్ జస్టిస్ పై కుట్ర చేస్తున్నారు అంటూ బాంబు పేల్చారు. కేంద్రంతో లాబీయింగ్ చేస్తూ, తమ ప్రభుత్వ విధానాలను తరుచూ తప్పు బడుతున్న హైకోర్టు చీఫ్ జస్టిస్ ను బదిలీ చేసే పనిలో ఉన్నారని, దీనికి సంబంధించి తన వద్ద సమాచారం ఉందని, కేంద్రం కూడా ఇందుకు సుముఖంగా ఉన్నట్టు, తనకు తెలిసింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు నారాయణ. కోర్టులు ప్రభుత్వ విధానాలు చట్ట ప్రకారం లేకపోతే వాటి పై కామెంట్ చేయటం, సర్వ సాధారణం అని అన్నారు. తమ పరిధిలో లేని ఎన్నికల కమీషనర్ ని రాష్ట్ర ప్రభుత్వం తప్పించే ప్రయత్నం చేస్తే, కోర్టు దాన్ని సరి చేసిందని, ఆ చర్యను రాష్ట్ర ప్రభుత్వం తట్టుకోలేక పోతుందని అన్నారు.

narayana 13122020 2

చట్ట విరుద్ధంగా పనులు చేస్తూ, కోర్టు మమ్మల్ని అనేస్తుంది అంటూ ప్రభుత్వం అనటం కరెక్ట్ కాదని అన్నారు. అమరావతి అంశంలో కూడా కోర్టు తమకు వ్యతిరేకంగా ఉందని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఉందని నారాయణ అన్నారు. ఎలా అయితే ఎన్నికల కమిషన్ ను తప్పించారో, అలాగే ఇప్పుడు తమకు ఇష్టం లేని జడ్జిలని బదిలీ చేసే పనిలో ఉన్నారని నారాయణ అన్నారు. కేంద్రం కూడా రాజ్యసభలో వీళ్ళ అవసరం ఉంది కాబట్టి, మద్దతు ఇస్తున్నారని అన్నారు. కోర్టులు జగన్ ని వ్యతిరేకించటం లదని, ప్రభుత్వం చేస్తున్న పనులని వ్యతిరేకిస్తుందనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. చీఫ్ జస్టిస్ పై నారాయణ ఏమన్నారంటే, "ఆంధ్రప్రదేశ్ లో న్యాయ వ్యవస్థకే ఒక ప్రమాదం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మహేశ్వరిని కూడా ట్రాన్స్ఫర్ చేయటానికి పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి చేసి, తద్వారా ఇక్కడ కోర్టు ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపుతుంది కాబట్టి, ఈ చీఫ్ జస్టిస్ మహేశ్వరిని, ట్రాన్స్ఫర్ చేయమని కేంద్రంలో లాబీయింగ్ చేస్తున్నారు. ఆ లాబీయింగ్ ప్రకారం, వాళ్ళు దాదాపుగా ఆమోదించినట్టు నాకు సమాచారం ఉంది." అని నారాయణ అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read