జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలనానికి తెర లేపింది. తమకు ఎవరు అడ్డు వచ్చినా, ఎవరైనా తప్పు అని చెప్పినా, వారిని తప్పించే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తూ వస్తుంది. శాసనమండలి రద్దు చేయటం కానీ, ఎలక్షన్ కమీషనర్ గా నిమ్మగడ్డను తప్పించటం కానీ, జడ్జిల మీద ఫిర్యాదులు కానీ, మాస్కు అడిగిన ప్రభుత్వ డాక్టర్ ను తప్పించటం కానీ, ఇలా అనేకం ఉన్నాయి. రెండు నెలల క్రితం, ఏకంగా సుప్రీం కోర్టు కాబోయే చీఫ్ జస్టిస్ ని టార్గెట్ చేస్తూ, లేఖలు బయటకు వదిలారు. అలాగే హైకోర్టులో ఉన్న ఆరుగురు జడ్జిల పై ఫిర్యాదు కూడా చేసారు. ఇవన్నీ జరుగుతూ ఉండగానే, ఇప్పుడు ఏకంగా ఒక హైకోర్టు జడ్జిని తమ కేసుని వాదించకుండా తప్పించాలి అంటూ, ఫిర్యాదు చేసి సంచలనానికి తెర లేపారు. హైకోర్టులో ఈ విషయం పై అఫిడవిట్ దాఖలు చేయటంతో, ఇది ఏ పరిణామానికి దారి తీస్తుందో ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రమైన ఆర్ధిక ఒత్తిడిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ 18 నెలల్లో లక్షా 30 వేల కోట్లు అప్పులు చేసారు. అవి కూడా సరిపోక పోవటంతో, బిల్డ్ ఏపి అనే పేరు పెట్టి, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములు అమ్మేసి, డబ్బు తెచ్చుకోవాలని ప్లాన్ వేసారు. అయితే సహజంగా చివరి అస్త్రంగానే భూములు అమ్ముతారు. ఎక్కడ అప్పు పుట్టకపోతేనే ఆస్తులు అమ్ముకుంటారు. మరి ప్రభుత్వం ఇలా చేస్తే, ప్రజలు చూస్తూ ఊరుకోరు కదా.

judge 16122020 2

దీని పై హైకోర్టులో కేసు వేసారు. ఈ కేసు జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే ఈ పిటీషన్ పై జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌, తీవ్రంగా స్పందించారు. దేశం ఏమైనా దివాళా తీసిందా ? భూములు అమ్ముకుని బ్రతకాల్సిన పరిస్థితి ఏమి వచ్చింది, అంత దయనీయ స్థితిలో ఉన్నారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నల పై ప్రభుత్వానికి సమాధానం లేకపోవటంతో, ఈ కేసులో వ్యతిరేక తీర్పు రావటం ఖాయం అని భావించిందో ఏమో కానీ, జడ్జి జస్టిస్ రాకేష్‌ కుమార్‌ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు అంటూ, ఆయన్ను ఈ కేసు విచారణ నుంచి తప్పించాలి అంటూ, హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసారు. దీనికి సంబంధించి, పత్రికల్లో వచ్చిన వార్తలు పిటీషన్ లో జోడించారు. అయితే అసాధారణ రీతిలో, కేసు మధ్యలో ఉండగా, ఇప్పుడు జడ్జి తమకు అనుకూలంగా లేరని తప్పించమని అఫిడవిట్ వేయటం పై, హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. జస్టిస్‌ రాకేష్‌ కుమార్‌ బెంచ్ ముందే, రాజ్యాంగ విచ్ఛిన్నం కేసు కూడా ఉంది. మొత్తానికి ప్రభుత్వం, న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు గురించి అలోచించి సరి చేసుకోకుండా, తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తే, న్యాయమూర్తుల పైనే ఫిర్యాదులు చేయటం పై, చర్చ జరుగుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read