జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, ప్రస్తుతం ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కన్నా, ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ తోనే ఎక్కువ ముప్పు ఉన్నట్టు ఉంది. ఆయన పదవి గడువు మార్చ్ 2021 వరకు ఉంటుంది. అప్పటి వరకు పంచాయతీ , మున్సిపల్ ఎన్నికలు జరగకుండా ప్రభుత్వం అనేక పావులు కదుపుతుంది. ఈ ఏడాది మార్చ్ లో, దేశంలో క-రో-నా ఎంటర్ అయిన సమయంలో దేశం మొత్తం జనతా కర్ఫ్యూ పెట్టే నిర్ణయం తీసుకోవటం, ప్రపంచటం మొత్తం వణికిపోవటం, ఎలా ఎదుర్కోవాలో ఐడియా లేకపోవటం, ప్రజలకు కూడా సరైన అవగాహన లేకపోవటంతో, అప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసారు. అయితే ఆ సందర్భంలో జగన్ మోహన్ రెడ్డి, నిమ్మగడ్డను కులం పేరుతో ఎత్తి చూపి, కరోనా చాలా చిన్నది అంటూ, చెప్పుకొచ్చారు. ఆ తరువాత, నిమ్మగడ్డను తొలగించారు. అప్పట్లో ఇది ఒక సంచలనం. రాజ్యాంగ పదవిలో ఉన్న వారిని, ప్రభుత్వం తొలగించటంతో అందరూ ఆశ్చర్యపోయారు. చివరకు సుప్రీం కోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగలటంతో, మళ్ళీ నిమ్మగడ్డ వచ్చారు. అయితే ఈ సారి క-రో-నా పై ప్రజలకు అవగాహన వచ్చింది, ప్రభుత్వానికి క్లారిటీ వచ్చింది, కేసులు కూడా భారీగా తగ్గిపోయాయి. బీహార్ లో అసెంబ్లీలో ఎన్నికలు జరిగాయి, రాజాస్థాన్, హైదరాబాద్ లో స్థానిక ఎన్నికలు జరిగాయి. కర్ణాటక, కేరళ రెడీ అవుతున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టారు నిమ్మగడ్డ. ఫిబ్రవరిలో ఎన్నికలు అని ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అయితే ప్రభుత్వం మాత్రం సెకండ్ వేవ్ వస్తుంది అంటూ కోర్టుకు వెళ్ళింది.
అయితే కోర్టు మాత్రం, మేం జోక్యం చేసుకోలేం అని చెప్పింది. అయితే ఈ సమయంలో సుప్రీం కోర్టుకు వెళ్ళినా ప్రభుత్వానికి అనుకూల ఫలితం వచ్చే అవకాసం లేదు. అందుకే ప్రభుత్వం తమ వద్దకు వచ్చిన ఒక నివేదికకు ఇప్పుడు వాడి, ఎన్నికల వాయిదాకు రెడీ అవుతుంది. ప్రభుత్వానికి వైద్య నిపుణులు ఒక నివేదిక ఇచ్చారు. అందులో తేదీలు వేసి మరీ సెకండ్ వేవ్ వస్తుందని చెప్పారు. జనవరి 15-మార్చి 15 మధ్యలో సెకండ్ వేవ్ వచ్చే అవకాసం ఉందని, జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 25 క్రిస్మస్ నాడు ఇళ్ళ పట్టాలు ఇచ్చేసిన తరువాత, నిబంధనలు కఠినంగా అమలు కానున్నాయి. న్యూ ఇయర్ వేడుకలు కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సరిగ్గా మార్చ్ 15తో సెకండ్ వేవ్ అంతం అవుతుందని ఆ నివేదిక చెప్తుంది. అంటే అప్పటికి నిమ్మగడ్డ పదవీ కాలం అయిపోతుంది. ప్రభుత్వం ఈ నివేదికను కోర్ట్ ముందు ఉంచి, ఎన్నికల వాయిదా కోరే అవకాసం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ నివేదిక, ఎలక్షన్ కమిషన్ కూడా పంపారని సమాచారం. మరి ప్రభుత్వం వేసిన ఎత్తు ఫలిస్తుందా ? ఎన్నికలు మార్చి వరకు వాయిదా పడతాయా ? చూడాలి మరి...