ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పులతో నెట్టుకుని వస్తున్న సంగతి తెలిసిందే. జీతాలు, పెన్షన్లు ఇవ్వటానికి కూడా ఒక్కో నెలలో ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. ఇక రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం కూడా జరగటం లేదు. అమరావతి నిర్మాణం ఆగిపోయింది, పోలవరం ఏమి అవుతుందో అర్ధం కానీ పరిస్థితి. ఈ నేపధ్యంలోనే ఈ 18 నెలల్లో దాదాపుగా లక్షా 30 వేల కోట్లకు పైగా అప్పులు చేసినట్టు కాగ్ చెప్తుంది. ఈ స్థాయి అప్పులు ఏ రాష్ట్రం కూడా చేయలేదు, చేయదు కూడా. గత చంద్రబాబు ప్రభుత్వం 5 ఏళ్ళలో, లక్ష కోట్లు అప్పు చేస్తేనే హడావిడి చేసిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు ఏడాదిన్నర లోనే, లక్షా 30 వేల కోట్లు అప్పు చేసారు. ఇంకా ఇంకా అప్పులు కోసం వేటాడుతున్నారు. కొత్త కొత్త మార్గాలు వెతుకుతున్నారు. కొన్ని బ్యాంకులు అప్పులు ఇవ్వకపోతే, ఏకంగా ప్రభుత్వ భూములు అమ్మటానికి కూడా వెనకాడటం లేదు. పోనీ ఏదైనా గుర్తుండే పోయే అభివృద్ధి చేస్తున్నారా అంటే, సున్నా. మరో పక్క పన్నుల బాదుడు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు కొత్త కొత్త రికార్డులు చేస్తున్న సమయంలో, మన రాష్ట్రం నుంచే రాజ్యసభ ఎంపీగా ఉన్న బీజేపీ ఎంపీ సురేష్ ప్రభు, రాష్ట్రాలు విచ్చల విడిగా చేస్తున్న అప్పుల పై కేంద్రానికి లేఖ రాసారు.

sureshprabhu 02122020 2

విశాఖపట్నం కు చెందినా, నరేష్ కుమార్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డైరెక్టర్ గా ఉన్నారని, ఆయన తనకు అప్పుల విషయంలో లేఖ రాసారని, ఆ అభిప్రాయం కరెక్ట్ అని నేను కూడా నమ్ముతున్నాను అంటూ, రాష్ట్రాలు విచ్చల విడిగా చేస్తున్న అప్పుల పై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ ద్వారా ఫిర్యాదు చేసారు. విచ్చల విడిగా చేస్తున్న అప్పులు కంట్రోల్ చేయాలని కోరారు. అలాగే ఇదే లేఖను మరో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కు కూడా లేఖ రాసారు. ప్రజాలను బుట్టలో వేసుకునే పధకాల కోసం, కొన్ని ప్రభుత్వాలు కార్పొరేషన్లు పెట్టి మరీ, విచ్చల విడిగా అప్పులు తీసుకుంటున్నాయని, ఇవి చాల ఆందోళనకర అంశం అని ఆయన అన్నారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ఎఫ్ఆర్బీఎం చట్టాలని అతిక్రమిస్తున్నారని అన్నారు. కార్పొరేషన్ల ద్వారా అప్పులు తీసుకుని, వాటిని వేరే వాటికి మళ్ళిస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. అప్పులు తిరిగి చెల్లించే సామర్ధ్యం కూడా చూడాలని, సిబిల్ స్కోర్ దాటి రుణాలు తీసుకుంటున్న వారి పై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కార్పొరేషన్ పెట్టి, 25 వేల కోట్లు అప్పు కోసం ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. సురేష్ ప్రభు లేఖ, ఏపిని టార్గెట్ చేసి రాసిందే అని అర్ధం అవుతుందని, విశ్లేషకులు అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read