రాష్ట్రంలో ఎప్పుడూ చూడని పోకడలు కనిపిస్తున్నాయి. ఏపి ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలు చూసి, ప్రజలు షాక్ అవుతున్నారు. అయితే ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటే, ప్రజలు ఏమి చేయలగలరు. దీని గురించి మాట్లాడుకుని వదిలేయటం తప్ప. మనం పుట్టిన రోజు కానే, ఇతర ముఖ్య దినాలు, మన ఇష్ట దైవం గుడికి కానీ, చర్చికి కానీ, మసీదుకు కానీ, వారి వారి నమ్మకాలను బట్టి వెళ్లి జరుపుకుంటూ ఉంటాం. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి స్థాయి నేతలు అయితే, తిరుమల నుంచి వేద పండితులు కానీ, ఇతర మతాల గురువులు కానీ వచ్చి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇవి మనం చూస్తూనే ఉంటాం. అయితే ఎప్పుడూ చూడని విధంగా, ఒక ప్రైవేటు స్వామి వారికి, ఇలాంటి సేవలే చేయండి అంటూ, ఏపి దేవాదాయ శాఖ ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పుడు చర్చనీయంసం అయ్యాయి. విశాఖ శారదా పీఠం, స్వరుపానంద స్వామి అంటే, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ అధినేతలకు ఇష్టులు. బహిరంగంగానే నేను జగన్ గెలవాలని పూజలు చేసానని స్వరుపానంద చెప్పారు కూడా. అయితే అది ఇద్దరి వ్యక్తుల మధ్య ఇష్టంగా ఉన్నంత వరకు బాధ లేదు కానీ, ప్రభుత్వాల వరకు వచ్చేస్తేనే ఇబ్బంది. స్వరుపానంద స్వామి పుట్టిన రోజు నవంబర్ 18. ఆ రోజు ఆయనకు వివిధ ఆలయాల నుంచి వచ్చి ఆలయ మర్యాదులు చేయండి అంటూ, శారదా పీఠం నుంచి, ఏపి ప్రభుత్వానికి నవంబర్ 9 న ఒక లేఖ వెళ్ళింది. దానికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం, నిన్న దేవాదాయ శాఖ, రాష్ట్రంలోని 23 ప్రముఖ దేవాలయాలకు ఆదేశాలు ఇస్తూ, ఆ రోజున స్వామి వారికి ఆలయ మర్యాదలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

swaroopa 14112020 2

ఇందులో తిరుపతి మినిహా, దాదాపుగా రాష్ట్రంలోని 23 ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. అంటే ఆ రోజు ఆ ఆలయాల్లో వివిధ దేవతా మూర్తులకు అలంకరించిన మాలలను, వేద పండితులు తీసుకు వెళ్లి, స్వరుపానంద స్వామిని ఆశీర్వదిస్తారు. అయితే ఇలా స్వామిజీలు పుట్టిన రోజు వేడుకలు జరపుకోవటమే ఆశ్చర్యం అంటుంటే, దానికి ప్రభుత్వం ఇలా అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వటంతో ప్రజలు విస్మయం చెందారు. స్వరుపానంద స్వామికి ఏ అర్హతతో ఇలా చేస్తున్నారని, రేపు ఇంకో స్వామి కానీ, మరొక బడా బిజినెస్ మ్యాన్ కానీ, మరో నాయకుడు కానీ ఇలాగే అడిగితే ఇచ్చేస్తారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. కంచి, శ్రింగేరి పీఠం వారికి కూడా దక్కని గౌరవాలు, ఒక సామాన్య స్వయం ప్రకటిత పీఠంకు దక్కటం పై విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వ అధికారులు, ఇవి ఆయా ఈవోలు ఇష్టం పై ఆధారపడి ఉంటాయని, కచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదని, మేము మాములుగా ఉత్తర్వ్యులు ఇచ్చామని చెప్తున్నారు. ఏది ఏమైనా, ఇలా నియమాలు లేకుండా, ఇష్టం వచ్చినట్టు చేస్తే, రేపు మరొకరు కూడా ఇలాగే అడుగుతారు, ఇవన్నీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్ప ఏమి ఉండదు. అంతగా ప్రభుత్వాది నేతలకు ఇష్టం అయితే, వ్యక్తిగత హోదాలో చేసుకోవాలి కానీ, ఇలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వటం అభ్యంతరమే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read