రాజమహేంద్రవరం వైసీపీలో మరోసారి విబేధాలు రచ్చకు ఎక్కాయి. గత రెండు రోజుల నుంచి, మూడు నాలుగు చోట్ల వైసీపీలోని రెండు వర్గాలు విబేధించి రచ్చకు ఎక్కితే, ఇప్పుడు ఏకంగా ఎంపీ, మాజీ ఎమ్మల్యే మధ్య విబేధాలు హాట్ టాపిక్ గా మారాయి. మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులను లక్ష్యంగా చేసుకుని, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఏకంగా హోంమంత్రికి లేఖ రాయటం వైసీపీలో కలకలం రేపుతుంది. వాస్తవానికి ఇద్దరూ కలిసి మొన్నటిదాకా పాదయాత్రలో కూడా పాల్గున్నారు. తోట త్రిమూర్తులు పార్టీలో చేరే సమయంలో, జగన్ కు అటు పక్కన తోట త్రిమూర్తులు ఉంటే, ఇటు పక్క పిల్లి సుబాష్ చంద్ర బోస్ ఉండి, ఇద్దరూ కలిసి పని చేస్తాం అనే సంకేతాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు త్రిమూర్తులను లక్ష్యంగా చేసుకుని, పిల్లి బోస్ లేఖ రాయటం చర్చనీయంసం అయ్యింది. 1996లో దళితుల శిరోమండనం కేసులో, తోట త్రిమూర్తుల పై ఏ1గా కేసు నమోదు అయ్యింది. అప్పటి నుంచి గడిచిన 23 ఏళ్ళుగా తన పలుకుబడి ఉపయోగించుకుని, తోట త్రిమూర్తులు ఈ కేసుని అదే పనిగా వాయిదా వేయించుకుంటున్నారని, ముఖ్యంగా ఇతని పలుకుబడి కారణంగానే ఇతని కేసు వాయిదా పడుతూ వస్తుందని, ఈ నేపధ్యంలోనే నిందితులకు న్యాయం జరగలేదని, అందుకే తక్షణం కేసుని తేల్చాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ లేఖలో తెలిపారు.
అంతే కాకుండా తోట త్రిమూర్తులు ఏ1గా ఉన్న కేసులో, ప్రభుత్వం నియమించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను మార్చేందుకు తోట త్రిమూర్తులు ప్రయత్నాలు చేస్తున్నారని, అది పూర్తిగా తప్పు అని, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఎట్టి పరిస్థితిలోనూ మార్చటానికి వీలు లేదని, ప్రస్తుత పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను కొనసాగించి ఈ కేసుని తేల్చాలని బోసు లేఖ రాయటం, మరోసారి వైసీపీలో ఉన్న వర్గ పోరు బయట పడిందని చెప్పాలి. వాస్తవానికి 1996లో జరిగిన ఈ ఘటన గురించి, అప్పట్లోనే తోట త్రిమూర్తులు 86 రోజులు, రాజమండ్రి సెంట్రల్ జైలు లో కూడా ఉన్నారు. ఆ తరువాత రాష్ట్ర హైకోర్టులో కేసు స్టే ఉండటంతో, అప్పటి నుంచి బయటే ఉన్నారు. అయితే గడిచిన 23 ఏళ్ళుగా, కేసు విచారణకు వస్తున్న సమయంలో త్రిమూర్తులు తెలివిగా తప్పించుకుంటున్నారని, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కేసుని వాయిదా వేసుకున్నారని, బోసు హోంమంత్రికి రాసిన లేఖలో ఈ విషయం స్పష్టం అవ్తుంది. మొన్నటి దాకా బోసు, త్రిమూర్తులు వేరే పార్టీల్లో ఉండే వారు. అయితే త్రిమూర్తులు వైసీపీలో చేరటంతో, ఇరు వర్గాల మధ్య ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఈ లేఖతో వర్గ విబేధాలు బహిరంగం అయ్యాయి.