ఏ ప్రభుత్వానికైనా, అప్పులు చేయటం అనేది సర్వ సాధారణం. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా, చివరకు కేంద్ర ప్రభుత్వం అయినా, అప్పులు చేస్తారు. అయితే దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఎక్కడా విచ్చలవిడిగా చేయరు. ప్రతి దానికి కొన్ని హద్దులు దగ్గర ఆగిపోతారు. అలాగే చేసిన అప్పు ఎక్కువగా అభివృద్ధి ఖర్చుల పై ఖర్చు చేసి, రూపాయి పెరిగే మార్గం చూసుకుంటారు. ప్రభుత్వాలే కాదు, వ్యాపార సంస్థలు కూడా అంతే. అయితే ఇదే కోవలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పులు చేసింది. అయితే ఈ అప్పులు కనీ వినీ ఎరుగని రీతిలో జరుగుతున్నాయి. గత తెలుగుదేశం హయంలో 5 ఏళ్ళలో లక్షా 20 వేల కోట్ల అప్పు చేసారు. అయితే దీనికే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ, గోల గోల చేసి, ప్రజల్లో చర్చకు పెట్టి, చంద్రబాబు నేరాలు ఘోరాలు చేసేస్తున్నారని ప్రజల్లోకి తీసుకు వెళ్ళింది. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీ పనులు చూస్తుంటే షాక్ కొడుతున్నయనే చెప్పాలి. 16 నెలల్లోనే దాదపుగా లక్షా 30 వేల కోట్లు అప్పు చేసేసారు. ఇది ఒక రికార్డుగా అందరూ చెప్తున్నారు. పక్కన ఉన్న తమిళనాడు, కర్ణాటక, తెలంగాణా, కేరళ రాష్ట్రాలు, మనం తీసుకున్న అప్పులో సగం కూడా తీసుకోలేదు. సరే మనం ఇంత అప్పు తీసుకున్నాం, అది ఏమైనా అభివృద్ధి కార్యక్రమంలో పెడుతున్నాం, దాని వల్ల ఆదాయం పెరుగుతుందా అంటే, అదీ లేదు. అలాంటి కార్యక్రమాలు రాష్ట్రంలో ఒక్కటి జరగలేదు. మరో పక్క పెట్టుబడులు లేవు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు ఏదో నడుస్తున్నాయి, రహదారులు అన్నీ గుంటలు పడిపోయాయి.
అయితే ఇక్కడ రాష్ట్ర ప్రజలకు వస్తున్న ప్రశ్న, చేసిన అప్పు అంతా ఏమి అవుతుంది ? మాములుగా వచ్చే ఆదాయంతో, జీతాలు, పెన్షన్లు, చెల్లించ వచ్చు. కొంత మేరకు సంక్షేమం కూడా చేయవచ్చారు. మరి ఇంత అప్పు చేసి ఏమి చేస్తున్నారు ? అంత పెద్ద ఎత్తున సంక్షేమం ఏమి చేస్తున్నారు ? గత ప్రభుత్వంలో చేసినట్టే అన్ని పధకాలు పేర్లు మార్చి చేస్తున్నారు. కాకపోతే మరో రెండు మూడు పధకాలు అధికం. అటు అభివృద్ధి లేక, ఇటు సంక్షేమం కూడా ఏదో మాములుగా నడుస్తున్నా, ప్రభుత్వానికి 16 నేలలకే లక్షా 30 వేల కొట్లు అప్పు అయ్యింది. ఆదాయం పెరగటం లేదు, అప్పులు పెరుగుతున్నాయి. మరో వైపు బ్యాన్కులు కుడా అప్పులు ఇవ్వటానికి అలొచిస్తున్నయి అనే వార్తలు వస్తున్నాయి. ఇలాగే కొనసాగితే, అప్పులు కట్టేవి పెరిగిపోయి, జీతాలకు కూడా చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం, భూములు అమ్మి సొమ్ము చేసుకోవాలని చూస్తుందనే వార్తలు వస్తున్నాయి. లక్షా 30 వేల కొట్లు అప్పు ఏమైంది, మళ్ళీ భూములు అమ్మటం ఏమిటి ? అసలు ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుందో, ప్రభుత్వం లెక్కలు వేసి, శ్వేత పత్రం విడుదల చేయాలనీ ప్రతిపక్షాలు కోరుతున్నాయి. అసాధారణ రీతిలో అప్పులు చేసి, ఆర్ధిక క్రమశిక్షణ లేకుండా, రాష్ట్ర భవిష్యత్తుని రిస్క్ లో పెడుతున్నారని, ప్రభుత్వం వెంటనే తన ధోరణి మార్చుకోవాలని ఆర్ధిక నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.