ఆంధ్రప్రదేశ్ లో ప్రజల అవసరాలు కంటే, రాజకీయాలే ఎక్కువ. ముఖ్యంగా పదవిలో ఉన్న వారు, తమ బాధ్యత మర్చిపోయి, పక్క వాళ్ళ పై తప్పులు నెట్టి, సమస్య నుంచి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదో చిన్న విషయాల్లో అయితే అనుకోవచ్చు, రాజధాని విషయం, రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం విషయంలో కూడా అదే తంతు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపీ, కేంద్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర బీజేపీ శాఖ, ఇద్దరూ ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు పైనే తప్పు నెట్టేసి, పబ్బం గడిపేస్తున్నారు. చంద్రబాబు చేయలేదు, చేయలేడు అనే కదా ప్రజలు ఆయన్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. మెడలు వంచేస్తాం అని ఒకరు, మాతోనే అభివృద్ధి అని మరొకరు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. 18 నెలలు పదవిలో ఉన్నారు. ఇప్పటికీ చంద్రబాబు వల్లే అంటే, ప్రజలు నమ్ముతారా ? మెడలు వంచేసి సాధిస్తామని, ఎందుకు సాధించలేదు అంటూ, చంద్రబాబు వైపు వేలు చూపిస్తే నమ్ముతారా ? మాతోనే దేశం వెలిగిపోతుందని అని నమ్మించి, ఇప్పుడు చంద్రబాబు వల్లే వెలుగులు లేవు అంటే ప్రజలు నమ్ముతారా ? తాజాగా జరుగుతున్న పోలవరం రచ్చలో, రెండు పార్టీల తీరు ఇలాగే ఉంది. చంద్రబాబు చంద్రబాబు చంద్రబాబు అంటూ నామస్మరణ చేస్తూ, కాలం గడిపేస్తున్నారు. గతంలో పోలవరం అంచనాలు రూ55 వేల కోట్లకు చంద్రబాబు ఆమోదింప చేసుకుంటే, ఇప్పుడు కేంద్రం 20 వేల కోట్లు మాత్రమే ఇస్తాం అంటుంది. ఇప్పటికే ఆమోదించి, తగ్గించారు. అయితే రాష్ట్రంలో ఉన్న వైసీపీ, ఎప్పుడో 2016లో చంద్రబాబు ఒప్పుకున్నారు, అందుకే కేంద్రం ఇలా చేసింది చంద్రబాబు నెట్టేసి, తమకు ఏమి సంబంధం లేదని తాము ఆంధ్రప్రదేశ్ కోసమే పుట్టామని చెప్తుంది.

verraju 13112020 2

ఇక అసలు ఇది చెయ్యాల్సిన కేంద్రం, ఆ కేంద్రంలో ఉన్న పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబునే నిందిస్తుంది. నిన్న తిరుపతిలో ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ, చంద్రబాబు అధికారుల్ని మ్యానేజ్ చేసి, పోలవరం అంచనాలు పెంచేసారని తేల్చేసారు. అంటే, చంద్రబాబుని తిట్టటం కోసం, కేంద్రంలో ఉన్న తమ ప్రభుత్వ అధికారులను కూడా నిందించే స్థాయికి వెళ్ళిపోయారు. ఒక పక్క కేంద్రం పోలవరంలో అవినీతి ఏమి జరగలేదు అంటే, చంద్రబాబు మొత్తం తినేసాడు అంటారు. పోలవరం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాటానికి, నీతి అయోగ్ సిఫారుసు అయితే, దీని పై అనుమానం ఉంది అంటారు. అంటే పోలవరం అంచనాలు పెంచటం చంద్రబాబు కుట్ర అని చెప్తూ, కేంద్రం చర్య సమర్ధిస్తూ, మరో పక్క అధికారులను కూడా చంద్రబాబు మ్యానేజ్ చేసారు అంటూ, తమ ప్రభుత్వాన్నే సంకిస్తున్నారు. చంద్రబాబు మీద ఉన్న ద్వేషం, సోము వీర్రాజుకు ఈ స్థాయిలో ఉంది. అయితే ఇది రాష్ట్రానికి చెందిన అంశం. చంద్రబాబుకి ఏమి అవ్వదు. పోలవరం అంచనాలు కోసం పోరాడకుండా, ఈ చంద్రబాబు గోల ఏంటో. పోలవరం ప్రాజెక్ట్ అవ్వకపోతే చంద్రబాబుకు ఏమి అవుతుంది, ఇబ్బందులు పాడేది రాష్ట్ర ప్రజలు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read