నీతి నిజాయతీగా ఉండటమే ఆయన చేసిన పాపం. తప్పు జరిగింది చూడండి అని చెప్పినందుకు, ఆయన పైనే కేసు పెట్టి, అరెస్ట్ చేసిన వింత ఘటన ఇది. నెల్లూరు జిల్లా అనికేపల్లికి చెందిన సామాన్య దళితుడు జైపాల్ వద్ద కష్టపడి పండించిన పంటను దళారులు తక్కువ ధరకు కొని ప్రభుత్వానికి మద్దతు ధరకు అమ్ముకున్నారు. తన పేరుతో అక్రమాలు జరిగాయని ఆయనే స్వయంగా జిల్లా ఉన్నతాధికారులను కలిసి విచారణ జరపమంటే బాధితుడిపైనే క్రిమినల్ కేసులు పెట్టారు. ధాన్యం కొనుగోళ్ల కుంభకోణం వెనకున్న వైసీపీ పెద్ద రెడ్లను కాపాడేందుకు దళితుడిని బలి చేసారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. జైపాల్ పై బనాయించిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని కోరుతూ, జైపాల్ తల్లితో కలిసి తెలుగుదేశం నాయకులు నిన్న కల్లెక్టరేట్ కు వచ్చారు. పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, పాశం సునీల్ కుమార్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జెన్ని రమణయ్య, శ్రీపతి బాబు, కుంకాల దశరధనాగేంద్ర ప్రసాద్, గుమ్మడి రాజా యాదవ్, నలగర్ల సుబ్రహ్మణ్యం తదితరులు, వచ్చి జైపాల్ అరెస్ట్ పై కలెక్టర్ కు మోర పెట్టుకున్నారు. న్యాయం చేయమని జిల్లా ఉన్నతాధికారులను స్వయంగా కలిసి కోరిన దళితుడిపై క్రిమినల్ కేసు పెడతారా అని కలెక్టర్ ని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లలో తన పేరుతో జరిగిన అక్రమాలపై విచారణ జరపమని కోరిన దళిత రైతు గాలి జైపాల్ పై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని ఖండించారు

jaipal 07112020 2

జైపాల్ తల్లి అచ్చమ్మ జరిగిన ఘటన పై బోరు మని మీడియా ముందు తన గోడ చెప్పుకుంది. కూలి చేసుకుని నిజాయతీగా బతకడమే తమకు తెలుసని దొంగతనాలు తమకు తెలియవని...ఇంతగా వేధించే బదులు మా కుటుంబాన్ని చం-పే-యం-డి కలెక్టర్ గారూ.. అని రోదించింది. నిజాయితీగా బ్రతకటమే మా తప్పా అని ప్రశ్నించారు. తప్పు జరిగింది అని ఫిర్యాదు చేస్తే తన బిడ్డ పైనే కేసు పెట్టారని, కష్టపడి బ్రతికే రైతు నా బిడ్డను, దొంగను చేసారు అంటూ బోరున విలపించారు. తాము చిన్న చిన్న వాళ్ళం అని, చిన్నగా వ్యవసాయం చేసుకుంటూ, చేపలు అమ్ముకుంటూ బ్రతికే వారమని, అలాంటిది తమ పైనే, అక్రమ కేసులు పెట్టి, దొంగతనం కేసులు పెట్టి వేధిస్తుంటే ఎవరికి చెప్పుకోవాలని వాపోయారు. ఎవరో చేసిన తప్పుకు తాము ఎందుకు బలి అవ్వాలని, తప్పుడు పత్రాలు సృష్టించి తమను ఇబ్బందులు పెడుతున్నారని, ఈ వయసులో నాకు ఈ కష్టం తెచ్చిపెట్టారని, దొంగలు, దోపిడీలు చేసే వాళ్ళు భయపడాలి కానీ, తాము నిజాయతీగా కష్టం చేసుకుని బ్రతికే వాళ్ళం అని వాపోయారు. అన్యాయం జరుగుతుంది అని చెప్తే, ఎక్కడ అన్యాయం జరిగిందో చూడాలి కానీ, తప్పు చేస్తున్నారు అని చెప్పిన మా పైనే కేసు పెట్టారని వాపోయారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read