తెలుగుదేశం నేతలను, రాష్ట్ర ప్రభుత్వం వెంటాడుతూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో తెలుగుదేశం నేతల పై ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారు. ఇందు కోసం, కొత్త కొత్త మార్గాలు, కోనేళ్ళ క్రిందట కాయితాలు ప్లాన్లు చూసి మరీ, చట్ట ప్రకారం ఎలాంటి ఇబ్బంది కలగకుండా, టిడిపి నేతలకు షాక్ ఇస్తున్నారు. గత నెలలో వారం రోజుల గ్యాప్ లో, విశాఖపట్నంలో తెలుగుదేశం నేత సబ్బం హరి, ఇంటి ప్రహరీ గోడను జీవీఎంసి అధికారులు, ఉదయం నాలుగు గంటలకు వచ్చి, చెప్పా పెట్టకుండా, జేసీబీలతో కూల్చేసారు. అది పార్క్ స్థలం అని, పార్క్ స్థలం వంద గజాలు ఆక్రమించి నిర్మాణాలు చేసారు అంటూ, అక్కడ వాచమేన్ కోసం ఉన్న టాయిలెట్ ని పడేసారు. అప్పుడే దీని పై రచ్చ జరిగింది. అయితే ఇవన్నీ సక్రమంగానే ఉన్నాయి అంటూ, సబ్బం హరి చెప్పుకొచ్చారు. ఇవన్నీ కాయితాలు అధికారులకు ఇస్తానని, వాళ్ళే తేలుస్తారని అన్నారు. దీని పై కోర్టుకు వెళ్ళే ఉద్దేశం లేదని తెలిపారు. అయితే సబ్బం హరిని మాత్రం వదలలేదు. జీవీఎంసి అధికారులు మళ్ళీ వేరే రూట్ లో వచ్చారు. ఓపెన్ స్పేస్ కోసం రిజర్వ్ చేసిన భూములు భవనాలు కట్టారు అంటూ, మరో విషయంతో సబ్బం హరి ఇంటికి వచ్చారు. అయితే ఈ సారి మాత్రం ఉదయం పూట జేసిబీలు వేసుకుని వచ్చి కూల్చలేదు.

sabbam 07112020 2

నోటీసులు అంటించి, అందులో మూడు రోజులు సమయం ఇస్తున్నట్టు చెప్పారు. అయితే ఈ నోటీసు ఇవ్వటానికి సబ్బం హరి ఇంటికి వెళ్ళగా, ఆయన ఇంట్లో లేరు. ఆయన వాచ్మెన్ కు నోటీస్ ఇవ్వగా, వాచ్మెన్ నోటీస్ తీసుకోవటానికి నిరాకరించారు. దీంతో అధికారులు ఆ నోటీస్ ని గోడకు అంటించి వెళ్ళారు. 40 ఏళ్ళ క్రితం వేసిన లే అవుట్ లో, రిజర్వ్ ఓపెన్ స్పేస్ వదలకుండా కట్టారు అంటూ, నోటీసులు ఇచ్చి, వాటిని మూడు రోజుల్లో తొలగించాలని, లేని పక్షంలో చట్ట ప్రకారం ఏమి చేయాలో, అది మేమే చేస్తాం అని ఆ నోటీసుల్లో చెప్పారు. ఇది ఇలా ఉంటే గతంలో కోర్టుకు వెళ్ళను అని చెప్పిన సబ్బం హరి, వేధింపులు రోజు రోజుకీ ఎక్కవు అవటంతో, ఆయన హైకోర్టుకు వెళ్లారు. శుక్రవారం కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. పిటీషన్ పై విచారణ చేసిన కోర్టు మధ్యంతర ఆదేశాలు ఇస్తూ, సోమవారం వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని, సోమవారం ఈ విషయం పై పూర్తి స్థాయిలో విచారణ చేసి, ఆ రోజు తదుపరి ఆదేశాలు ఇస్తామని కోర్టు తెలిపింది. అయితే మరోసారి సబ్బం హరికి నోటీసులు ఇవ్వటం పై చంద్రబాబు మండి పడ్డారు. ఇది ఆటివిక చర్య అని, ఎప్పుడు ఎవరిది కూల్చేద్దామా అనే ఆలోచనలే ఈ ప్రభుత్వానికి ఉన్నాయని విమర్శలు గుప్పించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read