రాష్ట్రంలో ఏప్రభుత్వ హయాంలో మానవహక్కులు కాపాడ బడ్డాయో, ఎవరిపాలనలోప్రజలు తమహక్కులను స్వేచ్ఛగా వినియోగించుకున్నారో, జాతీయ మానవహక్కుల దినోత్సవం సందర్భంగా వైసీపీఎంపీ గోరంట్ల మాధవ్ తెలుసుకుంటే మంచిదని టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు సూచించారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబునాయుడిపై, పరిటాల రవీంద్ర, ఆయనకుటుంబంపై తప్పుడు ప్రచారం చేసిన మాధవ్ ఎప్పటిలానే అతని అలవాటు ప్రకారమే వ్యవహరించాడన్నారు. మాధవ్ ఎంపీకాకముందు అతని పరిస్థితేమిటో అందరికీ తెలుసు నని, పోలీస్ అధికారిగా ఉన్న సమయంలో ఏనాడూ ఆయన తన విధినిర్వహణను సక్రమంగా చేసిందిలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి తొడలుకొట్టినవారికి, తగలబెట్టినవారికి, సభ్యతలేకుండా ఎదుటివారిని తూలనాడేవారికి ఏరికోరి మరీ ఎంపీ పదవులిచ్చా డనటానికి మాధవ్ ప్రత్యక్షఉదాహరణ అని మాణిక్యరావు స్పష్టం చేశారు. వైసీపీతరుపున పార్లమెంట్ కు ఎన్నికైనవారిలో 80శాతం మంది నేరప్రవృతి కలిగినవారేనని సాక్షాత్తూ పార్లమెంట్ కమిటీయే చెప్పడం జరిగిందన్నారు. మాధవ్ ఎక్కడున్నా తన నేర స్వభావాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడన్నారు. ఆయనపై చిన్నారిని అత్యాచారం చేసినందుకు ఫోక్సో చట్టం కింద కేసుమోపబడిందని, రాష్ట్రవ్యాప్తంగా ఇంకాఅనేక కేసులు మాధవ్ పై ఉన్నాయన్నారు. అటువంటి వ్యక్తి చంద్రబాబునాయుడిగురించి, పరిటాలరవీంద్ర, ఆయన కుటుంబం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నా రు. మాధవ్ గురించి చెప్పాలంటే చాలానే ఉందన్న మాణిక్యరావు, 1983కి ముందు రాష్టప్రజల పరిస్థితి ఎలాఉందో, మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని ప్రజలు ఎలాంటి దీనస్థితిలో బతికారో ఇప్పటికీ ప్రజలెవరూ మర్చిపోలేదనే నిజాన్ని గోరంట్ల తెలుసుకోవా లన్నారు.

1983లో టీడీపీ అధికారంలోకి వచ్చాకే, నిజమైన టువంటి స్వేచ్ఛావిధానం రాష్ట్రంలో అమలైందని, ప్రజలంతా స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడం జరిగిందన్నారు. రాయలసీమ ప్రాంతంలో పరిటాల నెత్తురు పారించాడంటున్న మాధవ్, టీడీపీ హాయాంలో రవీంద్ర అక్కడ నీళ్లుపారించాడనే నిజాన్ని తెలుసు కోలేకపోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు నాయుడు బీసీలకు అన్యాయం చేశాడని నేరచరితుడైన మాధవ్ చెప్పడం సిగ్గుచేటన్నా రు. నేరచరితులు, చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన వారి నోటివెంట మంచిమాటలు వస్తాయని ఆశించడం ప్రజల మూర్ఖత్వ మే అవుతుందన్నారు. టీడీపీ అంటేనే బీసీలపార్టీ అని, ఎందరు బీసీలను రాష్ట్ర, దేశస్థాయి నాయకులను తయారుచేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. దేవేందర్ గౌడ్, కింజారపు ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు, కాల్వ శ్రీనివాసులు, కింజారపు అచ్చెన్నాయుడు వంటివారు టీడీపీలో ఎలాంటి స్థానాల్లో ఉన్నారో మాధవ్ కి తెలియదా అని మాణిక్యరావు నిలదీ శారు. బీసీల్లోని రౌడీలకు పదవులిచ్చిన వైసీపీప్రభుత్వం, వారి ప్రవర్తన చూసి సిగ్గుపడాల్సిన సమయం వచ్చిందన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి గోదావరి జలాలను ఆప్రాంతానికి తరలించిన చరిత్ర టీడీపీదని మాణిక్యరావు స్పష్టంచేశారు. సీమప్రాంతంలోని ఫ్యాక్షనిజాన్ని రూపుమాపి, అక్కడివారికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించిన ఘనత కూడా టీడీపీకే దక్కుతుందన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read