జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అంటే తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. సుప్రీం కోర్టు జస్టిస్ గా పని చేసి రిటైర్డ్ అయ్యారు. అప్పట్లో సుప్రీం కోర్టు జడ్జీలు తిరుగుబాటుకి సారధ్యం వహించారనే ప్రచారం ఉండి. అయితే రిటైర్డ్ అయిన తరువాత కూడా ఆయన పేరు ఎప్పుడూ వార్తల్లో వస్తూనే ఉంది. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉంటూ, ఆయనకు కావాల్సిన న్యాయ సలహాలు ఇస్తున్నారని, ప్రచారం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి, న్యాయ స్థానాలకు, జడ్జిలకు మధ్య వచ్చిన గ్యాప్ తరువాత, చలమేశ్వర్ పేరు వినిపిస్తూ వచ్చింది. ఇక ఆయన కుమారుడు జాస్తి నాగభూషణ్ కూడా జగన్ క్యాంప్ లో ఆక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన పలు సందర్భాల్లో, జాస్తి నాగభూషణ్ కూడా వెళ్ళే వారని వార్తలు వస్తూ వచ్చేవి. అయితే ఇప్పటి వరకు ఇరు పక్షాలు ఎక్కడా ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడు తాజాగా జాస్తి నాగభూషణ్ కు ప్రభుత్వంలో కీలక పదవి లభించింది. జాస్తి నాగభూషణ్ ను ఏపీ అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఒక విధంగా ఎదో ఒకసాయం చేస్తారని ఊహించిందే అయినా, ఇంత తొందరగా తెర ముందుకు రావటం పై రాజకీయ పరంగా కూడా చర్చ జరుగుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read