మన దేశంలో సినిమా, రాజకీయాలు వేరు వేరు కాదు.ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో, సినిమా, రాజకీలు పెన వేసుకుని ఉంటాయి. అయితే సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారిలో చాలా కొద్ది మంది మాత్రమే సూపర్ సక్సెస్ అయ్యారు. మొదటిగా తమిళనాడులో ఎంజేఆర్ సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చి సూపర్ హిట్ అయ్యారు. ఆ తరువాత జయలలిత కూడా ఇలాగే సక్సెస్ అయ్యారు. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే, అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టటమే ఒక సంచలనం అయ్యింది. ఎంజేఆర్ లాగా ఎన్టీఆర్ కేవలం రాష్ట్రానికే పరిమితం అవ్వలేదు. దేశ రాజకీయాలను కూడా శాసించారు. ఒక సంచలనం అంటే వీరి పేర్లే చెప్పాలి. ఇక చిరంజీవి పార్టీ పెట్టినా సక్సెస్ కాలేక రాజకీయాలు నుంచి కూడా తప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ ఏదో లాగుతున్నారు. ఇప్పుడు తమిళనాడులో సూపర్ స్టార్ట్ రజినీకాంత్ కూడా పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. ఆయన రాజకీయ ఎంట్రీ పై కొన్ని సంవత్సరాల నుంచి చర్చ జరుగుతుంది. ఎట్టకేలకు ఆ చర్చకు ఫుల్ స్టాప్ పెడుతూ, తాను కొత్త పార్టీ పెడుతున్నట్టు రజిని ప్రకటించారు. డిసెంబర్ 31న పార్టీ పేరు ప్రకటిస్తారని చెప్తున్నారు. ఆ రోజున పార్టీ పేరు, జెండా, పార్టీ గుర్తు ఇలా అన్ని విషయాలు చెప్పనున్నారు. అయితే గత కొన్ని రోజులుగా వీటి అన్నిటి పై పార్టీ నేతలతో ఆయన చర్చిస్తున్నారు.
పార్టీ విధి విధానాల రూపకల్పనలో ఉన్నారు. ఈ సందర్భంగా తన పార్టీ చిహ్నం గురించి చర్చిస్తూ, తన పార్టీ గుర్తు సామాన్యుడి గుర్తులాగా ఉండాలని, రజినీ అభిప్రాయ పడుతూ, సైకిల్ గుర్తు ఎలా ఉంటుంది అని పార్టీ నేతలను అభిప్రాయం అడిగారు. అయితే ఇప్పటికే ఈ గుర్తు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి ఉందని, భవిష్యత్తులో ఈ విషయం పై అభ్యంతరాలు, ఇబ్బందులు రావచ్చని చెప్పగా, సైకిల్ అనేది సామాన్యుడికి దగ్గర అయ్యేది అని, సైకిల్ గుర్తు పెట్టటం కుదరదు అంటున్నారు కాబట్టి, సైకిల్ వెనుక పాల క్యాన్ కూడా ఉండేలా, (సైకిల్ తో పాల క్యాన్ కూడా ఉండేలా) గుర్తుని ఫైనల్ చేసారని తెలుస్తుంది. రాజినీ నటించిన సూపర్ హిట్ సినిమా అన్నామలైలో కూడా, రజినీకాంత్ ఈ గెట్ అప్ లో ఉంటారని, అది అందరికీ గుర్తుంటుందని, ఆ గుర్తుని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే పార్టీ జెండా కూడా మూడు రంగులు ఉండేలా చూసుకుంటున్నారని సమాచారం. ఈ మొత్తం వివరాలు త్వరలోనే అధికారికంగా రజినీ చెప్పనున్నారు.