2014తో విభజనతో రోడ్డున పడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, మొదటగా భరోసా ఇచ్చింది, రాజధాని అమరావతి. రాజధాని లేని రాష్ట్రం, ఆదయ వనరులు లేని రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఒక అడ్డ్రెస్, ఒక గుర్తింపు,మనకంటూ ఒక రాజధాని ఉండాలి అంటే కల సాకారం చేస్తూ, రాష్ట్రం మధ్యలో, కృష్ణా నది ఒడ్డున, అమరావతి అంకురార్పణం జరిగింది. అప్పటి నుంచి అమరావతి అనేది మనకు గర్వ కారణంగా మారింది. అమరావతి ప్రణాళికలు, గ్రౌండ్ అయిన పనులు చేసి, ఒక అద్భుతం మన ముందు సాక్షాత్కారిస్తుందని అందరూ అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు ఉంటుందని, 13 జిల్లాల ప్రజలకు ఉపాధి కేంద్రంగా తయారు అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ నిర్మాణాలు మధ్యలో ఉండగా, ప్రజల తీర్పు వేరేలా వచ్చింది. మన కళ్ళ ముందు అమరావతి నాశనం అయిపోతుంది. ఏ నోటితో స్మశానం అన్నారో, నిజంగానే అది స్మశానంలా మారిపోతుంది. అయితే అమరావతి రైతుల పోరాటంతో, ఇంకా అమరావతి పై ఆశలు సజీవంగా ఉన్నాయి. అమరావతి అంటే మరణం లేనిది. ఇప్పటికి కాకపొతే ఏ నాటికైనా దాని వైభవం రాక మానదు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా ? ఈ రోజు ఢిల్లీలో కొత్తగా పార్లమెంట్ భవనం నిర్మాణం జరుగుతుంది. ఇది కూడా మన అమరావతి ప్రాజెక్ట్ లాంటిదే.
అమరావతిలో పరిపాలన మొత్తం ఒక చోటు ఉండేలా, హౌసింగ్ మొత్తం పని చేసుకునే చోటుకు దగ్గరగా ఉండేలా ఎలా ప్లాన్ చేసారో, ఇప్పుడు ఢిల్లీలో కూడా సెంట్రల్ విస్టా అనే ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే, ఈ రోజు పార్లమెంట్ నిర్మాణం చేపట్టారు. అయితే ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదికి అభినందనలు తెలిపారు. మన దేశ చరిత్రలో సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ఒక మైల్ స్టోన్గా నిలిచిపోతుందని అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే చోటుకు చేర్చటం, ఎంతో ఉపయోగం అని చెప్తూ, చంద్రబాబు అమరావతిని తలుచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. సెంట్రల్ విస్టా లాగే, అమరావతిలో సెంట్రల్ స్పైన్ ప్రాజెక్ట్ పేరుతొ గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టామని, ఇప్పటికే హౌసింగ్ ప్రాజెక్ట్ లు 60 శాతం పైగా పూర్తయ్యాయి అని, సెక్రటేరియట్, హైకోర్టు పనులు మొదలయ్యాయని, అలాగే ఇక్కడ రాజ్ భవన్ కూడా వచ్చేలా ప్లాన్ చేసామని, అయితే ఇప్పుడు అమరావతిని నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. అమరావతి నిర్మాణం జరిగితే, దేశానికీ కూడా సంపదగా మారుతుందని అనుకున్నామని, అయితే అమరావతి అనేది దైవ నిర్ణయం అని, కాలమే దిక్సూచి చూపిస్తుంది అంటూ, చంద్రబాబు భావోద్వేగంతో ట్వీట్ చేసారు.