ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఒక జీవో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంసం అయ్యింది. ముఖ్యంగా అధికార వర్గాల్లో ఇది హాట్ టాపిక్ అయ్యింది. ఆ జీవోలో వాడిన భాష చూసి, అధికార వర్గాలు అవాక్కయ్యాయి. ఈ జీవో విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నీ. ఈ ఆదేశాలు ఇచ్చింది, వాణీ మోహన్ అనే ఐఏఎస్ కి. ఆ జీవోలో "మీరు ఏదైనా యూనివర్సిటీకి వెళ్లి చట్టాలు చదువుకుని రండి. మీ నైపుణ్యాన్ని పెంచుకోండి. ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి, మీ పని తనం పెంచుకోండి" అంటూ జీవోలో రాసారు. సహజంగా ఇలా ఒక అధికారి పని తనం గురించి జీవొలో ప్రస్తావన ఉండదు. ఏదైనా డిసిప్లిన్ ఆక్షన్ తీసుకుంటే, అంట వరకు చెప్పి వదిలేస్తారు. ఇలా ఏదైనా ఆ అధికారికి చెప్పాలి అనుకుంటే, ఇంటర్నల్ గా మేమోలు ఇస్తారు. ఆ మేమోలో వార్నింగ్ ఇవ్వటం కానీ, లేదా ఇంకా ఏమైనా సలహాలు కాని, సూచనలు కానీ ఇస్తారు. అయితే ఏకంగా జీవోలో ఇలా ఒక ఐఏఎస్ పై రాయటం పై, అందరూ ఆశ్చర్యపోయారు. ఈ జీవోలు ప్రజలు ఎవరైనా చూసేందుకు వీలుగా ఓపెన్ గా ఉంటాయి. మరి ఏకంగా చీఫ్ సెక్రటరీ సంతకంతో బయటకు వచ్చిన ఈ జీవో పై ఇప్పుడు చర్చ జరుగుతుంది.
వాణీ మోహన్ ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఆమె 1996 బ్యాచ్ ఐఏఎస్. అయితే ఈ జీవో ఇవ్వటానికి కారణం, ఆమె సర్వే సెటిల్మెంట్ డైరెక్టర్‌గా పని చేసిన కాలంలో ఆమె పై ఆరోపణలు వచ్చాయి. ఇదంతా 2016లో జరిగింది. తరువాత దీని పై ఎంక్వయిరీ జరిగింది. ఆ నివేదికలో తప్పు చేసారని తేలింది. తరువాత ఆమె ఆమె తన పై వచ్చిన ఆరోపణలు కొట్టేయాలని, ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చారు. అయితే ఇప్పుడు వాణీ మోహన్ అభ్యర్ధనను, గతంలో ఇచ్చిన విచారణ నివేదికను పరిశీలించి, ఆ జీవో విడుదల చేసారు. ఇక్కడ వరకు అంతా ప్రొసీజర్ ప్రకారం, వాళ్ళ రూల్స్ ప్రకారం జరిగింది. అయితే జీవోలో చివర్లో, అసాధారణ రీతిలో, ఐఏఎస్ ను చీఫ్ సెక్రటరీ హెచ్చరించటం, వెళ్లి చట్టాలు చదువకురండి అని చెప్పటం, పని తీరు మెరుగుపరుచుకుని, నైపుణ్యం పెంచుకోండి అని చెప్పటం పై అందరూ షాక్ అయ్యారు. ఆమె చట్టాలు గౌరవించలేదని, ఆ జీవో సారంశం. అయితే ఇలాంటివి సహజంగా మెమోలో ఇస్తారు కానీ, ఇలా ప్రజలు అందరూ చూసేలా జీవోలో ఎందుకు ఇచ్చారు అనేది చర్చగా మారింది. ఈ అంశం పత్రికల్లో వచ్చినా, ఎలాంటి వివరణ అధికారులు నుంచి రాలేదు.