ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ముఖ్య నేతగా, మాజీ ఎమ్మెల్యేగా పేరున్న విశాఖపట్నం నేత విష్ణుకుమార్ రాజు స్టైల్ వేరు. ఒక పక్క బీజేపీ నేతలు అందరూ జగన్ మోహన్ రెడ్డి పై, ఆయన ప్రభుత్వం పై ఏదో మొహమాటు పడుతూ కంమెంట్లు చేస్తూ, ఎక్కువగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తుంటే, విష్ణుకుమార్ రాజు మాత్రం, అధికారంలో ఉన్న వైసీపీ చేస్తున్న అరాచకాల పై, జగన్ మోహన్ రెడ్డి పాలనా వైఖరి పై తనదైన శైలిలో కౌంటర్ లు ఇస్తూ ఉంటారు. గత నెల రోజులుగా విష్ణుకుమార్ రాజు తరుచు మీడియా ముందుకు వచ్చి జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా వైజాగ్ లో అధికార పార్టీ చేస్తున్న అరాచకం పై, అలాగే శనివారం వస్తే చాలు, ఏదోఒకటి కూల్చివేయటం పై విష్ణుకుమార్ రాజు స్పందిస్తూ, వైజాగ్ లో శనివారం, ఆదివారం కూడా పని చేసే కోర్టులు పెట్టాలని కోరారు. ఇది ఇలా ఉండగా, ఈ రోజు విష్ణుకుమార్ రాజు మరోమారు సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ రోజు విష్ణుకుమార్ రాజు, తన నియోజకవర్గంలో పర్యటించారు. పేదలకు ఇళ్లు ఇవ్వటం లేదు అంటూ నిరసన కార్యక్రమం చేసారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, జగన్ మొహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసారు. నియంత, ఉత్తర కొరియా అధ్యక్ష్యుడు కిం తో జగన్ ని పోల్చారు. అంతే కాదు, ఆంధ్రా కిం జగన్ మొహన్ రెడ్డి అంటూ, తీవ్ర స్థాయిలో విమర్శించారు.

vishnu 09122020 2

జగన్ మోహన్ రెడ్డి, ప్రజల కష్టాలు తెలుసుకోవటం లేదని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి గతంలో, రెండున్నర ఏళ్ళ తరువాత మంత్రులను మార్చేస్తాం అని చెప్పారని, అయితే రెండేళ్ళలో ముఖ్యమంత్రి మారిపోయే అవకాసం ఉంది అంటూ బాంబు పేల్చారు. అలా జరిగితే, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఒక మహిళకు ఎలా అవకాసం ఇచ్చారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మొదటి మహిళా ముఖ్యమంత్రి వచ్చే అవకాసం ఉందని, సంచలన వ్యాఖ్యలు చేసారు. తదుపరి సియంగా, జగన్ సతీమణి భారతి రెడ్డి అవుతారని ఆయన వ్యాఖ్యలు చేస్తూ, అలా చేస్తే ప్రజలు కూడా సంతోషిస్తారని, మహిళలకు ప్రజల కష్టాలు ఎక్కువ తెలుస్తాయని, ఆవిడైనా ప్రజలను ఆదుకుంటారని అన్నారు. ఎన్నో సమస్యలు ఆమె పరిష్కరిస్తారని అన్నారు. పేదలకు నిర్మించిన ఇళ్లు కూడా ఇవ్వకుండా, వేదిస్తున్నారని, ప్రజలు వివిధ కష్టాలు పడుతున్నాయని, తొందర్లోనే జగన్ దిగిపోయి, మహిళా సియాం వస్తారని చెప్తూ, విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యల పై బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గారు ఏమంటారో.

Advertisements

Advertisements

Latest Articles

Most Read