ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలకు సహకరించాలి అంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏపి చీఫ్ సెక్రటరీకి ఈ రోజు మరో లేఖ రాసారు. నీలం సాహ్నీతో పాటుగా, పంచాయతీ రాజు, గ్రామీణభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి కూడా లేఖ రాసారు. ఈ లేఖలో ప్రాధనంగా, ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రొసీడింగ్స్ ఇచ్చిందని తెలిపారు. అయితే ప్రొసీడింగ్స్ పైన స్టే ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుని ఆశ్రయించింది. అయితే హైకోర్ట్, దీని పై స్టే ఇవ్వటానికి నిరాకరించింది. నిమ్మగడ్డ ఈ రోజు రాసిన లేఖలో ఈ అంశాలు అన్నీ కూడా ప్రస్తావిస్తూ, ఫిబ్రవరిలో నిర్వహించ తలపెట్టిన స్థానిక సంస్థల ఎన్నికలకు సహకరించాలి అంటూ, ఆయన లేఖలో చీఫ్ సెక్రటరీని కోరారు. అదే విధంగా, రాష్ట్రంలో ఓటర్ల జాబితా గురించి కూడా ప్రస్తావిస్తూ, 2021 ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను జనవరి నాటికల్లా పూర్తి చేయాలని, దీంతో ఫిబ్రవరి నాటికి ఎన్నికలు పూర్తి చేయటనికి, ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పి, ఆ లేఖలో పేర్కోన్నారు. ఎన్నికల నిర్వహణకు సహకరించాలని, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్, గత నెలలో చీఫ్ సెక్రటరీకి ఒక లేఖ రాసారు. ఈ నేపధ్యంలోనే, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన రెండో లేఖ అని చెప్పుకోవాలి. మొదట రాసిన లేఖకు ప్రభుత్వం సిద్ధంగా లేదనే సంకేతాలు ఇచ్చింది. అంతే కాదు, ఈ విషయం పై కోర్టుకు కూడా వెళ్ళింది. అయితే కోర్టు ఈ కేసు పై విచారణ చేస్తుంది. ఇంకా విచారణ దశలోనే ఈ పిటీషన్ ఉంది.
అయితే ఇప్పటికే తాము ఎన్నికలు ఆపమని చెప్పలేం అంటూ కోర్టు తేల్చేసింది కూడా. హైకోర్టు ఇప్పటికే స్టే ఇవ్వటానికి నిరాకరించటం, ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రెండో లేఖ రాయటంతో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. హైకోర్టు ఆదేశాలు సవాల్ చేస్తూ సుప్రీం కోర్ట్‌కు వెళ్తుందా, లేదా ఎన్నికలకు రెడీ అవుతుందా అనేది చూడాలి. ఒక పక్క నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా ఉన్నంత కాలం, ఎన్నికలు నిర్వహించ కూడదు అనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉందని తెలుస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టుకు వెళ్ళటం తప్ప వేరే దారి లేదని పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం, ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇక మరో పక్క ఎన్నికల నిర్వహణ తేదీ తమను అడిగి చేయాలి అంటూ అసెంబ్లీలో తీర్మానం చేసారు. ఇది ఒర్దినన్స్ రూపంలో వచ్చే అవకాసం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే ఇది రాజ్యాంగ విరుద్ధం అని గవర్నర్ కు ఫిర్యాదు వెళ్ళింది. దీని పై ఎలాంటి పరిణామాలు జరుగుతాయో కూడా చూడాల్సి ఉంది.