కర్నూల్ జిల్లా శ్రీశైలం దేవస్థానం సన్నిధిలో రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మధ్య, సవాల్ వార్ నడుస్తుంది. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పై విమర్శలు చేసారు, ఘోషామహల్ ఎమ్మల్యే రాజా సింగ్. శ్రీశైలం దేవస్థానం షాపుల్లో మొత్తం ముస్లింలను ఎమ్మెల్యే నింపేసారని విమర్శలు చేసారు. ఎమ్మెల్యే దౌర్జన్యాలు జగన్ మోహన్ రెడ్డి ఆపాలని, లేకపోతే తాము చలో శ్రీశైలం పిలుపు ఇచ్చి తగిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు రాజా సింగ్. శ్రీశైలం దేవస్థానం సర్వ నాశనం చేసే కుట్ర వైసీపీ నేతలు చేస్తున్నారని ఆరోపించారు. దాన్ని ఆపే బాధ్యత జగన్ మోహన్ రెడ్డి దే అని, మేము కలుగు చేసుకుని రంగంలోకి దిగితే వేరే రకంగా ఉంటుందని, జగన్ శ్రీశైలం దేవస్థానాన్ని కాపాడాలని అన్నారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యాఖ్యల పై , శిల్పా చక్రపాణి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో లాగా, బీజేపీ మతాలను రెచ్చగొట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా చెయ్యాలి అనుకుంటే కుదరదని అన్నారు. మేము ఇలాంటివి చూస్తూ కుర్చుమని అన్నారు. తన పై ఇలా లేని పోనీ ఆరోపణలు చేస్తాను అంటే కుదరదు అని అన్నారు. తన పై చేసిన ఆరోపణలు ఎమ్మెల్యే రాజాసింగ్ నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని, లేకపోతే రాజాసింగ్ అతని పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు.

silpa 271220202

రాజా సింగ్ శ్రీశైలం ఎప్పుడు వస్తారో చెప్పాలని, పేదల సమక్షంలో కూర్చుని అన్నీ చర్చిద్దామని అన్నారు. ఏపిలో హిందూ మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తాను అంటే కుదరదు అని అన్నారు. బీజేపీ ఇలాంటి ఆటలు ఆడితే చూస్తూ ఊరుకోం అని అన్నారు. శ్రీశైలం నుంచి ముస్లింలను వెళ్ళగొట్టటానికి తాము ఎవరం అని రాజాసింగ్ ను ప్రశ్నించారు. 40 ఏళ్ళ నుంచి వాళ్ళు అక్కడే ఉంటున్నారని అన్నారు. వాళ్ళు సుప్రీం కోర్టు నుంచి ఆర్డర్స్ కూడా తెచ్చుకున్నారని అన్నారు. తన హిందుత్వం గురించి వీళ్ళకు ఏమి తెలుసని, తన పై హిందూ ద్రోహిగా ముద్ర వేయాలని చూస్తున్నారని అన్నారు. శ్రీశైలంలో హడావిడి చేస్తున్న బీజేపీ కార్యకర్తలు అంతా పైడ్ ఆర్టిస్ట్ లు అని అన్నారు. దీని పై స్పందించిన రాజా సింగ్, తమకు శ్రీశైలం కేవలం మూడు గంటలే అని, ఎప్పుడు రావాలో చెప్తే అప్పుడు వస్తాం అని అన్నారు. అంతే కాదు అక్కడ అన్యమతస్తులకు కేటాయించిన షాపుల వివరాలు మీడియాకు విడుదల చేసారు. అలాగే ఆలయ ప్రాంగణంలో, ఈవో కార్యాలయంలో అన్యమత ప్రచారం పై కూడా స్పందించారు. తమను వైసీపీ ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని, తాము తలుచుకుంటే, దేశం మొత్తం శ్రీశైలం తీసుకుని వచ్చి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read