అమరావతి జనభేరి సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఉదయమే కనకదుర్గమ్మ ఆశీస్సులు తీసుకున్నాని, అమ్మ ఆశీసులు మనకు ఉన్నాయని, అమ్మవారు మూడొకన్ను తెరిచి రాక్షసుల్ని అంతమోందిస్తుందని చంద్రబాబు అన్నారు. సభకు వచ్చే ముందు, ఉద్దండరాయినిపాలెంలో ఉన్న శంకుస్థాపన స్థలాన్ని పరిశీలిస్తే కడుపు తరుక్కుపోయిందని, గత స్మృతులు అన్నీ గుర్తుకు వచ్చాయని, ఎంతో గొప్పగా నిర్మాణం చేద్దాం అనుకుంటే, ఈ రోజు ఇలా చేసారని అన్నారు. ఉదయం ఉద్దండరాయినిపాలెం వెళ్లకుండా నన్ను అడ్డుకున్నారని, వీళ్ళకు నన్ను అడ్డుకునే హక్కు ఎక్కడుందని అన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ ముఖ్యమంత్రి అంటున్నాడని. 18నెలలు ఏం పీకావ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. అమరావతి లో భూమి కొనలేదు, ఇల్లకట్ట లేదని నన్ను అనే జగన్ ఇక్కడ ఇల్లు కట్టి ఏం పీకడని ప్రశ్నించారు. కులం కులం అంటున్నాడని, ఒక కులంలో పుట్టడం నా తప్పా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కులం కోసం చేయలేదని అన్నారు. అమరావతి ఉద్యమంలో మహిళల పట్ల దుస్యాసునిడి మాదిరి వ్యవహరించారని అన్నారు. ప్రపంచం అంతా అమరావతి గురించి మాట్లాడుకోవాలని కృషి చేయటమే నేను చేసిన తప్పా అని ప్రశ్నించారు. అన్ని పార్టీల మద్దతు అమరావతికి ఉంటే జగన్ ఒక్కడిదే వితండవాదం అని, ఇది ఎంత వరకు సమంజసం అని అన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు జగన్ కు చాలెంజ్ చేసారు. రాష్ట్రమంతా తనవైపు ఉందంటున్న జగన్ రెఫరెండం కు సిద్ధమా అని సవాల్ విసిరారు. ప్రజలంతా అమరావతి ని రాజధానిగా వద్దనుకుంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని, ఎన్నికలకు వెళ్దాం అని చంద్రబాబు అన్నారు. పోరాడకపోతే... భవిష్యత్తు లో బానిసలుగా మిగిలిపోతారని, అమరావతి ఆడబిడ్డలు ఈ ఉద్యమానికి ఒక స్పూర్తి అని అన్నారు. అధికారం నాకు కొత్త కాదు.. ఇప్పుడు అధికారం కోసం ఇలా చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజలకు న్యాయం జరగాలి, రైతుల వ్యధను గుర్తించాలి, 365రోజులలో ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపారు, నేను వెంకన్నను, దుర్గమ్మ ను కోరుకున్నా, అన్యాయం చేస్తే... వెంకన్న ఈ జన్మలోనే వారికి బుద్ధి చెబుతారు అని అన్నారు. నా కోసం కాదు... రాజధాని కోసం, రాష్ట్రం కోసం కోరుకున్నా, భావితరాల భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరుకున్నా, రాష్ట్రం లో మనసున్నవారంతా ఒక్కసారి ఆలోచించండి అని చంద్రబాబు అన్నారు. ప్రజల్లో కూడా మార్పు రావాలి.. అన్యాయాన్ని ప్రశ్నించాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే రెఫరెండంకు సిద్దం కావాలి, 45రోజుల్లో ఎవరి ప్రచారం వారు చేసుకుందాం, మీరే గెలిస్తే... నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా, అంటూ చంద్రబాబు ఛాలెంజ్ చేసారు.