ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎంతో కీలకమైన కేసు ఇది. ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనుగడకే ముప్పుగా ఈ కేసుని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక హెబియస్ కార్పస్ పిటీషన్ లు హైకోర్టు ముందు దాఖలు అయ్యాయి. మాటి మాటికి ఈ కేసులు నమోదు కావటం, డీజీపీని కోర్టుకు పిలిచి హెచ్చరించినా, ఆయన నుంచి మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటాం అని చెప్పించినా, మళ్ళీ మళ్ళీ ఈ హెబియస్ కార్పస్ పిటీషన్ లు దాఖలు కావటం పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పౌరులను నిర్బంధించటం సామాన్య విషయం కాదు అంటూ కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా, అసలు రాష్ట్రంలో ఏమి జరుగుతుంది ? ప్రజాస్వామ్యం ఉందా ? రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరుగుతుందా అనే అనుమానం కలుగుతుందని, దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు చెప్పాలని, రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందో లేదో చెప్పాలని, పిటీషనర్ తరుపు న్యాయవాదులను కూడా హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనానికి దారి తీసాయి. రాజ్యాంగ విచ్ఛిన్నం జరగటం అంటే, ఆ ప్రభుత్వం పూర్తిగా రాజ్యాంగాన్ని పక్కన పెట్టింది అనే లెక్క. ఒక వేళ ఇదే నిజం అని విచారణలో తేలితే, అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది.

sc 18122020 2

అయితే ఈ కేసు తీవ్రతను గమించిన ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేసింది. ఈ పిటీషన్ పై నేడు సుప్రీం కోర్టు ముందుకు విచారణకు వస్తుంది. హైకోర్టు మధ్యంతర ఆదేశాలను సవాల్ చేసిన ప్రభుత్వం ఈ పిటీషన్ దాఖలు చేసింది. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం అంశంపై హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారి చేసింది. రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా తేలుస్తామని అక్టోబర్ 1న హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు వెనక్కి తీసుకోవాలన్న ఏపీ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు మధ్యంతర ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. రాజ్యాంగ విచ్ఛిన్నం అంశంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనంలో నేడు ఈ కేసు పై విచారణ జరగనుంది. ఒక వేళ సుప్రీం కోర్టు స్టే ఇస్తే, ప్రభుత్వానికి ఊరటఇస్తుంది. అయితే ఒక వేళ సుప్రీం కోర్టు స్టే ఇవ్వకపోతే మాత్రం, ఏపి ప్రభువాన్ని షేక్ చేసే విధంగా ఈ కేసు ముందుకు వెళ్ళే అవకాసం ఉంది. మరి ఏమి అవుతుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read