ఒంగోలు దివ్యాంగురాలు భువనేశ్వరి సజీవ ద-హ-నంపై చంద్రబాబు దిగ్భ్రాంతి. ఈ దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని చంద్రబాబు డిమాండ్. ఒంగోలులో దివ్యాంగురాలు భువనేశ్వరి సజీవ ద-హ-నంపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వార్డు వాలంటీర్ గా పనిచేస్తున్న భువనేశ్వరి అనుమానాస్పద పరిస్థితుల్లో సజీవ ద-హ-నం కావడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో ఇప్పటిదాకా దళితులు, గిరిజనులు, ముస్లింలు, బిసిల మాన ప్రాణాలకు భద్రత లేకపోవడం చూశాం. ఇప్పుడు దివ్యాంగుల మాన, ప్రాణాలకు కూడా రక్షణ లేదనేది ఈ దుర్ఘటనతో వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా అనుమానాస్పద మ-ర-ణా-లు, హ-త్య-లు, హ-త్యా-చా-రా-లు, అమానుష చర్యలు పెరిగిపోవడం ఆందోళనకరం. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఓం ప్రతాప్ అనుమానాస్పద మృ-తి తెలిసిందే. అతని కాల్ లిస్ట్ బైటపెట్టాలని కోరినా చర్యలు లేవు. గుంటూరు జిల్లా గురజాలలో దళిత యువకుడు దోమతోటి విక్రమ్ ను హ-త-మా-ర్చా-రు. అతని కాల్ లిస్ట్ బైటపెట్టాలని కోరినా ఫలితం లేదు. ఇప్పుడు ప్రకాశం జిల్లా ఒంగోలులో భువనేశ్వరి సజీవ ద-హ-న-మైం-ది. ఆమె కాల్ లిస్ట్ ను బహిర్గతం చేస్తే నిజానిజాలన్నీ బైటకు వస్తాయి. ఇలాంటి దుర్ఘటనలపై మొదట్లోనే కఠినంగా వ్యవహరించి వుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఇంత దారుణంగా క్షీణించే దుస్థితి వచ్చేది కాదు. దోషులను పట్టుకోలేక పోవడం, ఆధారాలు సేకరించలేక పోవడం, ప్రభుత్వ వైఫల్యాలే..

cbn 19122020 12

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారాయి. బైటకెళ్లిన మహిళలు క్షేమంగా తిరిగివచ్చే పరిస్థితి లేకపోవడం బాధాకరం. రాజమండ్రిలో దళిత మైనర్ బాలికపై గ్యాంగ్ రే-ప్, తాడిపత్రిలో, ఉదయగిరిలో,చంద్రగిరిలో అ-త్యా-చా-రా-లు..18నెలల్లో వందలాది మహిళలపై అ-ఘా-యి-త్యా-లు చోటుచేసుకోవడం రాష్ట్రంలో భయానక పరిస్థితులకు నిదర్శనం. భువనేశ్వరి సజీవ ద-హ-నం వెనుక ఏం జరిగింది..? ఇది హ-త్యా, హ-త్యా-చా-ర-మా అనుమానాలను నిగ్గుతేల్చాలి. రాత్రి 8.30గంకు దుర్ఘటన జరిగితే మరుసటి రోజు సాయంత్రం దాకా పోస్ట్ మా-ర్ట-మ్ ఎందుకని జరపలేదు..? 20గంటల జాప్యం పోస్ట్ మా-ర్ట-మ్ లో ఎందుకు జరిగింది..? కుమార్తె మృ-త-దే-హం కోసం కుటుంబ సభ్యులు 20గంటలు ఆసుపత్రి వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..? ఈ దుర్ఘటనపై పూర్తిస్థాయిలో అత్యున్నత దర్యాప్తు జరపాలి, నిజానిజాలను బైటపెట్టాలి, దీనికి కారకులను కఠినంగా శిక్షించాలని’’ చంద్రబాబు డిమాండ్ చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read