జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలసొమ్ముని ప్రకటనలరూపంలో దుబారా చేస్తోందని, “గుండెలనిండా జగన్ అజెండా... తొలిఏడు జగనన్నతోడు” అంటూ తనవ్యక్తిగత మరియు పార్టీ ప్రచారానికి ముఖ్యమంత్రి రూ.24కోట్ల62లక్షల 40వేల రూపాయాల ప్రజల సొమ్ముని ప్రభుత్వం కేటాయించిందని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ ఆక్షేపించారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆవివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! ఏడాదిపాలన పూర్తయిన సందర్భంలో తనపార్టీ ప్రచారానికి జగన్ ప్రభుత్వ సొమ్ముని ఎలాఖర్చుచేస్తాడని టీడీపీతరుపున ప్రశ్నిస్తు న్నాను. ఏడాదిన్నరలో ప్రజలకు చేసిందేమీ లేకపోయినా, పార్టీ ప్రచారానికి ప్రభుత్వ సొమ్ముని ఉపయోగిస్తోంది. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పోలవరంపై దుష్ప్రచారాలుచేశారని, అవన్నీ అవాస్తవాలని చెప్పడంకోసం, ఆనాడు చంద్రబాబుప్రభుత్వం ప్రజలను పోలవరం సందర్శనకు తీసుకెళ్లి, భోజనాలు పెడితే, దానిపై గతంలో జగన్, ఆయనపార్టీవారు అసెంబ్లీలో నానాయాగీ చేశారు. మరిప్పుడు రూ.24కోట్ల 62లక్షలను పార్టీ కార్యక్రమాలకు ఎలా మళ్లించారో సమాధానంచెప్పాలి. ఆనాడు అన్నంపెట్టడాన్ని తప్పుపట్టిన వైసీపీనేతలు, జగన్మోహన్ రెడ్డి, నేడు అధికారంలోకి వచ్చాక రంగులకే రూ.4వేలకోట్లు తగలేశారు. ముఖ్యమంత్రి, వైసీపీమంత్రులు దానికేం సమాధానం చెబుతారో చెప్పాలి. రూపాయి జీతం తీసుకుంటానని చెబుతున్న జగన్, తన ఇంటికి వేసేరోడ్లు, ఇతర సౌకర్యాలకల్పనకే రూ.50కోట్ల ప్రజలసొమ్ముని ఖర్చుచేశాడు.

jagan 18122020 2

అమరావతి ఉద్యమానికి వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వాదిస్తున్న లాయర్లకే జగన్ ప్రభుత్వం రూ.కోట్లాది రూపాయలను ఖర్చుచేసిందన్నారు. ఎలక్షన్ కమిషనర్ వ్యవహారం కోర్టులోఉండగానే అత్యుత్సాహం ఆపుకోలేక కనగరాజ్ ని తీసుకొచ్చి ఈసీగా తీసుకొచ్చి కోట్లరూపాయాలను దుర్విని యోగం చేశారు. సాక్షిపత్రికలో ప్రకటనలకు, సొంతడబ్బాలు కొట్టుకోవడానికి రూ.50కోట్ల ప్రజలసొమ్ముని ఖర్చుచేయడం దుబారా కాక ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి లేస్తే ప్రకటన, కూర్చుంటే ప్రకటన, అవిచాలవన్నట్లు ఇసుకపాలసీపై ప్రజల సలహాలుకోరుతూప్రకటనలివ్వడం మరో దారుణం. సాక్షిపత్రికకు మేలుచేయడానికే ఆ విధమైన ప్రకటనలిచ్చారు. సెంటుపట్టా పథకంలో వేలకోట్ల అవినీతి చేశారు. మద్యం వ్యాపారంలో అవినీతి మొత్తాన్ని ఒకేచోటకేంద్రీకృతంచేసిన ప్రభుత్వం, మద్యపాన నిషేధం ముసుగులో పెద్దఎత్తున సంపదను పోగేసుకుంటోంది. అటువంటి ప్రభుత్వం సిగ్గులేకుండా ప్రతిపక్షాలను, ఆపార్టీనేతలను ఎలా విమర్శిస్తుంది? 15-12-2020న తీసుకొచ్చిన జీవో 257ను వెంటనేరద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాను. పార్టీ కార్యక్రమాలకు ఖర్చుచేసిన మొత్తాన్ని అధికారపార్టీనే భరించాలి. ప్రజలసొమ్ముని పార్టీ కార్యక్రమాలప్రచారానికి వాడుకోవడాన్ని టీడీపీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నాము.

Advertisements

Advertisements

Latest Articles

Most Read