మరోసారి చంద్రబాబుని అడ్డుకున్నారు పోలీసులు. ఈ 18 నెలల్లో ఇలా చంద్రబాబుని అడ్డుకోవటం నాలుగో సారి గా చెప్తున్నారు. ఒకసారి ఆత్మకూరు వెళ్ళకుండా, మరోసారి ఇసుక నిరసన, అలాగే మరోసారి వైజాగ్ కి వెళ్ళిన సమయంలో చంద్రబాబుని ఆపేసారు. ముఖ్యంగా వైజాగ్ వెళ్ళిన సమయంలో చంద్రబాబుని ఆపిన విషయం హైకోర్టు వరకు వెళ్ళటం, డీజీపీ కూడా కోర్టుకు వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు అమరావతిలో ఏడాది అవుతున్న సందర్భంగా అమరావతిలో పెద్ద సభ జరుగుతుంది. ఈ సభకు వెళ్ళేందుకు ముందుగా, అమరావతి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెం వెళ్ళటానికి చంద్రబాబు వెళ్ళగా, ఆయన్ను పోలీసులు ఆపేశారు. మల్కాపురం వద్ద చంద్రబాబుని అడ్డుకున్నారు. ఉద్దండరాయునిపాలెం వెళ్లడానికి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. అయితే  పోలీసులతో అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ చర్చలు జరిపారు. చివరకు చంద్రబాబుకి ఒక్కరికే అనుమతి ఇస్తాం అని, ఎవరినీ వదలం అని చెప్పటంతో, సభ జరగకుండా కుట్ర పన్నరేమో అని గమనించి, ఎవరినీ వదలక పోయినా, చంద్రబాబు ఒక్కరే ఉద్దండరాయునిపాలెం వెళ్లారు. అయితే తెలుగుదేశం నేతలు మండి పడుతున్నారు. పర్మిషన్ ఇచ్చి, ఉద్దండరాయునిపాలెం వెళ్ళటానికి ఇబ్బంది ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. ప్రశాంతంగా సాగుతుంటే, ఎందుకు ఇంత రాద్దాంతం అని ప్రశ్నిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read