అమరావతిలో 365 రోజులో దీక్షలు పూర్తి అయిన సందర్భముగా గురువారం నిన్న రాయపూడి వద్ద అమరావతి ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జనభేరీ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. రాయపూడి సీడ్ యాక్సిస్ రోడ్డు పై సభ నిర్వహించారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో రెండువేల ఇరవై ఐదు మంది పోలీసుల సంరక్షణలో జనభేరి సభ ఎటువంటి సంఘటనలు జరుగకుండా విజయవంతముగా జరిగింది. సభకు సుమారు 35 వేలమంది హాజరైన్నారని రాజకీయ విశ్లేషకుల అంచనా. సభనుద్దేశించి టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మాట్లాడుతూ, వీరోచితంగా పోరాడదాం,మీ అందరికీ నేను తొడుగావుంటాను,ప్రజల హక్కులు కాపాడి న్యాయం చేయడమే నా ధ్యేయమని అమరావతి రాజధాని నిలుస్తుంది,మిమ్మల్ని గెలిపిస్తాను అని ప్రజలలో పూర్తి విశ్వాసం నింపారు. 45 రోజుల్లో రెఫరెండంకి రావాలి అని మరోసారి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కాంగ్రెస్ నేత తులసీ రెడ్డి మాట్లాడుతూ మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ అమరావతి రాజధానికి కట్టుబడి ఉందని తెలియజేసారు. రాజధానికి 34 వేల ఎకరాలు ఇచ్చిన రైతులందరికి పాదాభి వందనం తెలిపారు.ఈ ఉద్యమాన్ని 13 జిల్లాల పోరాటం చేద్దామని,ఇక్కడ కులం,మతం పేరుతో ముక్కలు చేసే ప్రయత్నం జరుగుతుందని, అమరావతి కోసం కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో చేస్తుందని హామీ ఇచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ అమరావతి రైతులు పోరాటం చరిత్రలో భావితరాలకు స్పూర్తిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.
బీజేపీ నాయకులు పాతూరి.నాగభూషణం మాట్లాడుతూ అమరావతి రాజధాని ఇక్కడే ఉండాలని బీజేపీ తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు.టీడీపీ యువనేత వంగవీటి.రాధ మాట్లాడుతూ రాజధానిలో ఏ ఒక్కకులానిది కాదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి. శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వంపై తిరగపడితేనే , ప్రభుత్వం దిగివస్తుందని, ఉదాహరణకు పంజాబ్ రాష్ట్ర రైతుల పోరాటం గుర్తు చేశారు.ఈ కార్యక్రమములో జేఏసీ నేతలు శివారెడ్డి, తిరుపతిరావు, మల్లికార్జున రావు, శైలజ, పువ్వాడ. సుధాకర్, సుంకర. పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. అయితే అమరావతికి వైసీపీ మినహా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. చంద్రబాబుతో వేదిక పంచుకోం అని చెప్పిన బీజేపీ కూడా సభకు వచ్చింది. అయితే సీపీఎం పార్టీ మాత్రం నిన్న సభకు రాలేదు. బీజేపీ వస్తే మేము రాము అంటూ లేఖ రాసారు. అయితే ఇది సరైన పధ్ధతి కాదని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒకే వేదిక పైన ఉన్నాయని, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు గోడ మీద పిల్లి వైఖరి ప్రదర్శిస్తూ, మొదటి నుంచి జగన్ కు అనుకూలంగా ఉన్నారని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ పార్టీలు అమరావతి కోసం కలవంగా లేనిది, సిపియం మధు గారికి ఏమైందో మరి.