ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థలు వాయిదా వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ కు సంబంధించి, ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్, ఈ రోజు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ కౌంటర్ అఫిడవిట్ లో రాష్ట్ర ప్రభుత్వం, అనేక కీలక అంశాలను పేర్కొంది. క-రో-నా వాక్సిన్ రావటానికి మరో మూడు నుంచి ఆరు నెలలు పట్టే అవకాసం ఉందని, ఈ లోపు వ్యాక్సిన్ వచ్చినా కూడా దాన్ని ప్రాధాన్యతా క్రమంలో వేయాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఆ పిటీషన్ లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు, ఈ వ్యాక్సిన్ ప్రక్రియ ఎట్టి పరిస్థితిలోను అడ్డు రాదని కూడా వారు తమ అఫిడవిట్ లో స్పష్టం చేసారు. స్థానిక సంస్థలకు సంబంధించి, ప్రజారోగ్యం ముఖ్యం అని తామూ అంగీకరిస్తున్నాం అని, అయితే ఇదే సమయంలో వ్యాక్సిన్ పంపిణీకి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధం లేదు అని కూడా స్పష్టం చేసారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇప్పటికే బీహార్, రాజస్థాన్, హైదరాబాద్ లో ఎన్నికలు విజయవంతంగా నిర్వహించారని ఈ కౌంటర్ అఫిడవిట్ లో, రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తు చేసింది. అలాగే హైకోర్టు ఆదేశాలు తరువాత రాష్ట్రంలో అన్ని పార్టీల అభిప్రాయం తీసుకుంటూ ఒక మీటింగ్ పెట్టమని, అందరి అభిప్రాయాలు తీసుకున్నామని కూడా తెలిపారు,

nimmagadda 17122020 2

ఏపిలో ఈ ఎన్నికల నిర్వహణకు సానుకూల వాతావరణం ఉందని చెప్పటంతో పాటు, అందరినీ సంప్రదించి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి సమాచారం తీసుకున్న తరువాత మాత్రమే, అన్ని విషయాలను బేరీజు వేసుకుని ఆ తరువాత, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని, రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందని, చెప్పి ఆ అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం, వేసిన పిటీషన్ ను కొట్టి వేయాలని, దీనికి సంబంధించి తగిన ఆదేశాలు ఇవ్వాలని కూడా హైకోర్టుని రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యర్ధించింది. రెండు వారల క్రిందట ప్రభుత్వం ఈ పిటీషన్ దాఖలు చేసింది. ముందుగా ఎన్నికల సంఘం ఫిబ్రవరిలో ఎన్నికలు అంటూ ప్రొసీడింగ్స్ ఇచ్చిన దాని పై కోర్టుకు వెళ్ళిన ప్రభుత్వం, ఆ ఆదేశాలు కొట్టేయాలని సెకండ్ వేవ్ వస్తుంది అంటూ తెలిపింది. అయితే హైకోర్టు ఈ విషయంలో మేము జోక్యం చేసుకొం అని చెప్పటంతో, అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేసి, అందులో వ్యాక్సిన్ విషయం ప్రస్తావిస్తూ కోర్టుకు తెలిపారు. దీని పై ఈ రోజు ఎన్నికల సంఘం కౌంటర్ వేసింది. మరి దీని పై హైకోర్టు ఏమి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read