రాష్ట్ర పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జనకులశ్రీనివాస రావు చంద్రబాబునాయుడి వ్యాఖ్యలను తప్పుపట్టారని, చంద్రబాబునాయుడి వ్యాఖ్యలు చట్టాలను అతిక్రమించమని ప్రోత్సహించేలా ఉన్నాయని చెప్పడం జరిగిందని, శ్రీనివాసరావు వ్యాఖ్యలు దున్నపోతు ఈనిందంటేదూడను కట్టేయమన్నట్లుగా ఉన్నాయని టీడీపీ జాతీయఅధికారప్రతినిధి వర్లరామయ్య ఎద్దేవాచేశారు. శుక్రవారం ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. డీజీపీ కార్యాలయంలో ఎవరో తయారుచేసిన నోట్ పై సంతకంపెట్టేసే ఏపీ పీస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసరావు, తానువిలేకరులకు పంపిన నోట్ లో కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేశాడన్నా రు. చంద్రబాబు నాయుడు పోలీసులపై తప్పుడుకేసులుపెట్టమని ప్రోత్సహిస్తున్నారని చెబుతున్న శ్రీనివాసరావు, అతను సంతకం పెట్టిన నోట్ తయారుచేసినవ్యక్తి, ప్రతిపక్షనేత ఏసందర్భంలో ఏమిమాట్లాడారో తెలుసుకుంటే మంచిదని రామయ్య సూచించారు. శ్రీనివాసరావు చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కు తీసుకోవాలన్నారు. శ్రీనివాసరావు మీడియావారికిపంపిన నోట్ లో చెప్పినట్లుగా, చంద్రబాబు నాయుడు పోలీసులపై తప్పుడుకేసులు పెట్టమని ఎక్కడా చెప్పలేదన్నారు. (చంద్రబాబునాయుడు ఏం మాట్లాడారో తెలియ చేస్తూ, అందుకు సంబంధించిన వీడియోను రామయ్య విలేకరు లకు ప్రదర్శించారు) పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసరా వు వాస్తవాలు తెలుసుకోకుండా, ఎవరో తయారుచేసిన ప్రెస్ నోట్ లపై సంతకాలు పెడితే దానికే అతనే బాధ్యుడవుతాడని రామయ్య తెలిపారు. టీడీపీవారిని వేధించి, బాధిస్తూ, వారుచేసే ఫిర్యాదులను స్వీకరించకుండా, వైసీపీవారి ఫిర్యాదులను తీసుకొని కక్షపూరితం గా వేధించే పోలీసులపై కేసులు పెట్టాలని మాత్రమే చంద్రబాబు చెప్పారన్నారు. పోలీస్ వ్యవస్థలో కొంతమంది అధికారులు ఎలావ్యవహరిస్తున్నారో శ్రీనివాసరావుకి తెలియదా అనిరామయ్య ప్రశ్నించారు. పోలీసులపై దొంగకేసులు పెట్టమని చంద్రబాబు నాయుడు ఎక్కడన్నారో నిరూపించాలని రామయ్య సవాల్ చేశారు.

చంద్రబాబునాయుడి వ్యాఖ్యల్లో ఏమినేరపూరితం ఉందో, ఆయనేం తప్పుమాట్లాడారో శ్రీనివాసరావు చెప్పాలన్నారు. పోలీసులు ఫిర్యాదులు తీసుకోకుంటే, కోర్టుల్లో ప్రైవేటు కేసులువేయాలని చెప్పడ నేరమెలా అవుతుందన్నారు. టీడీపీ అధినేత ఏంమాట్లాడారో శ్రీనివాసరావు చెబితే, చంద్రబాబు వ్యాఖ్యల్లో తప్పులేదని నిరూపించడానికి తానుసిద్ధంగా ఉన్నానని రామయ్య తెలిపారు. పోలీస్ వ్యవస్థలో చాలాకాలంపనిచేసిన శ్రీనివాసరావుకి రాష్ట్రంలో పోలీసులు ఎలా పనిచేస్తున్నారో తెలియదా అని టీడీపీనేత నిలదీశారు. పై అధికారులుచెప్పింది విని ఎక్కడపడితే అక్కడ సంతకం పెట్టే, శ్రీనివాసరావు పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండి, ఉపయోగం ఏముంటుందని రామయ్య మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరంలో శిరోముండనం కేసులో వైసీపీనేతల మాటలునమ్మి, అన్యాయంగా బలైన ఎస్సైని శ్రీనివాసరావు ఏనాడైనా పరామర్శించాడా అని రామయ్య ప్రశ్నిం చారు. ఆళ్లగడ్డలో ఒక సీఐ,హెడ్ కానిస్టేబుల్ జైలుపాలైతే, పోలీస్ అసోసియేషన్ వారివద్దకు వెళ్లిందా అన్నారు. పోలీస్ వ్యవస్థ గురించి తెలిసిన శ్రీనివాసరావు తన పైఅధికారులు ఏదిచెబితే అది వింటే, ప్రభుత్వచర్యలకు బలవుతున్న పోలీసులకు ఆయనేం న్యాయంచేస్తాడన్నారు? ఏపీ పోలీస్ అధికారుల అసోసియేషన్ నిన్నటికి నిన్న ఇచ్చిన ప్రెస్ నోట్ ని తీవ్రంగా ఖండిస్తున్నానని, చంద్రబాబుని కించపరిచేలా ఎవరైనా ముందుముందు మాట్లాడితే, వారిపై కోర్టులకువెళ్లి చర్యలు తీసుకుంటామని రామయ్య తేల్చిచెప్పారు. పనిచేయని అధికారులపై, పోలీసులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడమనేది రాజ్యాంగం కల్పించిన హక్కని, దాన్ని ఉపయోగించుకోవాలని చంద్రబాబు చెబితే, అదితప్పెలా అవుతుందని రామయ్య ప్రశ్నించారు. పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు తన అసోసియేషన్ కు చేయాల్సిన పనులు చాలాఉన్నాయని, అవన్నీ ఆయన సక్రమంగాచేస్తే, తానే ఆయన్ని అభినందించి సన్మానిస్తానని రామయ్య స్పష్టంచేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read