ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 10 రోజులుగా కుదిపేస్తున్న టాపిక్ పోలవరం. గత తెలుగుదేశం హయంలో పునాదులు లోపల ఉన్న ప్రాజెక్ట్ పనులు, 72 శాతం పూర్తి చేస్తే, ఇప్పటికీ రాష్ట్రం ఖర్చు పెట్టిన డబ్బులు కేంద్రం ఇవ్వలేదు. ఇక మరో పక్క పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచాలు దాదాపుగా 55 వేల కోట్లు రూపాయలను, కేంద్ర జల శక్తి శాఖ టెక్నికల్ కమిటీ ఆమోదించి, కేంద్ర ఆర్ధిక శాఖకు పంపించింది. ఇందు కోసం తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఒక లక్ష కాయితాలు ఢిల్లీ పంపించి, కేంద్రాన్ని ఒప్పించింది. అయితే అధికారం పోవటం, వైసీపీ అధికారంలోకి రావటం, తరువాత పోలారం నిర్మాణం అటకెక్కటం తెలిసిందే. అయితే, ఇప్పుడు తాజాగా, గతంలో తెలుగుదేశం ఆమోదింపచేసుకున్న రూ.55 వేల కోట్లు కాకుండా, కేవలం రూ.20 వేల కోట్లు మాత్రమే ఇస్తాం అంటుంది. అయితే కేంద్ర వైఖరి పై అందరూ స్పందిస్తుంటే, ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రముఖ పార్టీగా ఉన్న జనసేన మాత్రం స్పందించటం లేదు. దాదాపుగా 10 రోజులు తరువాత, జనసేన ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి, పోలవరం పై స్పందించింది. జనసేన అధికార ప్రతినిధి కందుల దుర్గేశ్ పేరుతొ ఈ ప్రకటన విడుదుల అయ్యింది. ఈ ప్రకటన చూసిన వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జనసేన కూడా రాజకీయ పార్టీ కాబట్టి, సహజంగానే, తెలుగుదేశం, వైసీపీ పై విమర్శలు చేసింది. ప్రకటన మొదటి లైన్ లోనే, పోలవరం ఇలా అవ్వటానికి కారణం తెలుగుదేశం పార్టీ అని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీ అంటూ, మొదటి లైన్ లోనే విమర్శలు గుప్పించారు. రాజకీయ పార్టీల విమర్శలు సహజం కాబట్టి, దీని విషయంలో ఏమి మాట్లాడ లేం.
అయితే ఈ వివాదానికి, మోసానికి మొత్తం కారణం అయిన కేంద్రం ప్రభుత్వం పై సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ అనేది , ఆంధ్రప్రదేశ్ హక్కు. ఈ దేశ పార్లమెంట్ ఇచ్చిన హక్కు. అది ఎవరో దయ మీద మనకు వచ్చేది కాదు. గతంలో పవన్ కళ్యాణ్ గారు, ఉత్తరాది అహంకారం మీద మాట్లాడుతూ, చేసిన వ్యాఖ్యలు ఇవి. అయితే జనసేన తమ అధినేత చెప్పిన మాటలే మర్చిపోయినట్టు ఉంది. పోలవరం ప్రాజెక్ట్ పై ప్రస్తుత పరిస్థితిలో కేంద్రం ఉదారంగా స్పందించి, పోలవరం పూర్తి చేయాలి అంటూ, సన్నాయి నొక్కులు నొక్కుతుంది. కేంద్రం చొరవ చూపాలని, ఉదారంగా వ్యవహరించాలని దేబిరించటం ఏమిటో జనసేనకే అర్ధం కావాలి. ఎంత మిత్ర పక్షం అయితే మాత్రం, పోలవరం ప్రాజెక్ట్ కు ఇంత అన్యాయం చేస్తుంటే, ఎలా ఊరుకుంటారు ? జనసేన అన్నట్టు, తెలుగుదేశం, వైసీపీది తప్పే కావచ్చు, కానీ అంతకు మూడింతల తప్పు కేంద్రం చేస్తుంది. మనకు పార్లమెంట్ వేదికగా, ఈ దేశ చట్టాల ప్రకారం, పోలవరం హక్కు. ఇది మోడీ ఇష్టమో, ఎవరో దయో కాదు. కేంద్రాన్ని నిలదీయాల్సిన పార్టీలు అన్నీ, ఇలా కేంద్రానికి వత్తాసు పలుకుతున్నాయి కాబట్టే, కేంద్రం ఇష్టం వచ్చినట్టు ఆడుతుంది. ఇంత ప్రజాదరణ ఉన్న పవన్ కళ్యాణ్ కూడా, కేంద్రం ఉదారంగా సాయం చేయాలి అంటుంటే, కేంద్రానికి అలుసు కాక ఇంకేం ఉంటుంది. రాష్ట్ర ప్రజలు ఈ పార్టీలను నమ్ముకోకుండా, కేంద్రం పై పోరాడాల్సిన సమయం వచ్చిందేమో.