అధికారంలో ఉన్న పార్టీ, దూకుడు మీద ఉంటుంది. ప్రతిపక్షాలు దిగాలుగా ఉంటాయి. ఇక మన రాష్ట్రంలో 151 సీట్లు ఉన్న వైసీపీ పార్టీ , దూకుడు మీద ఉండాలి. కానీ ఎందుకో కానీ, ప్రతి సారి డిఫెన్సు లోనే ఉంటుంది. 151 సీట్లు చేతిలో ఉంటే, ప్రతిపక్షాలను ఫుట్ బాల్ ఆడవచ్చు కానీ ఎందుకో వైసీపీ మాత్రం తడబడుతుంది. ముఖ్యంగా కొత్తగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేసి, తమ సత్తా చాటుతూ ఉంటారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఎప్పుడైనా అధికార పార్టీకి అనుకూలత ఎక్కువ ఉంటుంది. పక్కన ఉన్న తెలంగాణా, రెండో సారి అధికారంలోకి రాగానే, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేసి, మొత్తం కైవసం చేసుకుంది. అయితే ఇక్కడ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ప్రభుత్వం ఎందుకో వెనుకడుగు వేస్తుంది. ఇక్కడ గత మార్చ్ లో ఎన్నికలు ఆగిపోయాయి అని తెలుసు కానీ, ఆసలు ఎన్నికలు జరపమని హైకోర్టు చెప్తేనే, ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందుకు వచ్చిందనే `విషయం చాలా మందికి తెలియదు. అంటే దాపుగా 10 నెలల పాటు అధికారంలో ఉన్నా, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టలేదు. ఎవరో కోర్టుకు వెళ్తే, కోర్టు డైరెక్షన్ ప్రకారం ఎన్నికల ప్రక్రియ మొదలు అయ్యింది. ఒక్కసారి ఎన్నికలు ప్రక్రియ మోదలు అయితే, మొత్తం ఎన్నికల కమిషన్ చేతుల్లోకి వెళ్లి పోతుంది. అందుకే క-రో-నా గురించి ప్రపంచం భయపడుతున్న సమయంలో, ఎన్నికలు వాయిదా వేసింది ఎన్నికల కమిషన్. అయితే ఎన్నికలు జరపాల్సిందే అంటు వైసీపీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

రెండు రోజుల్లో దాదాపుగా 60 మందికి పైగా నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల కమిషన్ పై, ఎన్నికలు జరపాల్సిందే అంటూ దుమ్మెత్తి పోశారు. తరువాత ప్రభుత్వం హైకోర్టు, సుప్రీం కోర్టుకు వెళ్ళినా వాళ్ళ వల్ల కాలేదు. ఇక తరువాత, ఎన్నికల కమిషన్ ను తప్పించటం, ఆయన మళ్ళీ కోర్టు ద్వారా పదవిలోకి రావటం తెలిసిందే. ఈ మొత్తం ఎపిసోడ్ తరువాత, మళ్ళీ ఆ కేసు కోర్టులో వాయిదాకు రావటంతో, కోర్టు ఎన్నికల ప్రక్రియ గురించి ఈసి అభిప్రాయం అడిగింది. అయితే మళ్ళీ వైసీపీ ఇప్పుడే ఎన్నికలు వద్దు అంటూ రాగం అందుకుంది. ప్రతిపక్షాలు ఎన్నికలు కావలి అంటుంటే, ప్రభుత్వం ఎన్నికలు వద్దు అంటుంది. అంటే ప్రభుత్వానికి ఇప్పుడు ఎన్నికలకు వెళ్తే నెగ్గం అనే భయం ఉందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ముందుగా ఇసుక లేక, పనులులేక అల్లాడిన ప్రజలు, క-రో-నాతో పూర్తిగా చతికిల పడ్డారు. ఇదే సమయంలో ప్రభుత్వం కరెంటు బిల్లులు, బస్ చార్జీలు, పెట్రోల్ చార్జీలు, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, వాయించి పడేస్తుంది. మరో పక్క రోడ్డులు అధ్వాన్నంగా ఉన్నాయి. వరదలతో రైతులు అల్లాడిపోయారు. చేతికి వచ్చిన పంట నష్ట పోవటం, వరదల్లో ప్రభుత్వం సరిగ్గా ఆదుకోక పోవటం కూడా మైనస్ అయ్యింది. ప్రజలు సంతోషంగా లేరు. మొత్తం నెగటివ్ మూడ్ ఉంది. ఇక మరో పక్క నిమ్మగడ్డ ఉంటే తమ ఆటలు సాగవు అని అధికార పక్షం అభిప్రాయం. మొత్తంగా, ఎన్నికలు అంటే అధికార పక్షం భయపడుతుంది. మరో పక్క ప్రతిపక్షాలు మాత్రం, ఎన్నికలు కావాలని కోరటం, మన రాష్ట్రంలో ఉన్న రివర్స్ పాలనకు అద్దం పడుతుందని, విశ్లేషకులు అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read