ఏబీవీ పై దేశ ద్రోహం కేసు పెట్టాలి... ఏబీవీ తన అవినీతి కోసం, దేశాన్ని పణంగా పెట్టారు. దేశం విడిచి పారిపోతారు, లుక్ అవుట్ నోటీసులు ఇవ్వాలి. రక్షణ పరికరాలు కొనుగోలు చేసి, దేశాన్నే ప్రమాదంలో పెట్టారు. ఇవి గతంలో వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు... అయితే ప్రభుత్వం ఏబీవీ పై అభియోగాలు మోపి ఆయన్ను సస్పెండ్ చేసారు. దీని పై న్యాయస్థానాల్లో కూడా పోరాటాలు చేసారు. అయితే దీని పై సుప్రీం కోర్టులో కేసు వచ్చిన సమయంలో, చార్జ్ షీట్ ఏది అని సుప్రీం కోర్టు అడిగితే, ఆయన్ను సస్పెండ్ చేసిన 10 నెలలు తరువాత, ఏబీవీ పై చార్జెస్ నమోదు చేసారు. అయితే ఈ చార్జెస్ లో గతంలో చెప్పినట్టు దేశ ద్రోహం విషయం కానీ, ఆయన దేశ ద్రోహం చేస్తూ ఏమైనా చేసారా ? ఏమన్నా వేల కోట్ల స్కాం చేసారా ? పోనీ కనీసం ఒక కోటి రూపాయల చార్జెస్ అయినా ఫ్రేమ్ చేసారా ? అసలు ప్రభుత్వం ఏమి చెప్పిందో అని అందరూ ఆసక్తిగా చూసారు. అయితే ప్రభుత్వం మొత్తంగా ఒక 17 పేజీల జీవో విడుదల చేసింది. క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నాం అంటూ, ఆ నోట్ లో తెలిపారు. అయితే గతంలో చెప్పినట్టు, ఎక్కడా దేశ ద్రోహం గురించి ప్రస్తావనే లేదు. దీంతో అందరూ ఆశ్చర్య పోయారు. గతంలో అంతలా హడావిడి చేసి, ఆయన పరువు తీసి, డీజీ క్యాడర్ ఉండే ఒక అధికారిని ఇలా పరువు తీసి, చివరకు చార్జెస్ పెట్టే సమయంలో మాత్రం, ఎక్కడా దేశ ద్రోహం గురించి ప్రస్తావన చేయలేదు. ఆయన స్పయింగ్ చేసారు అని గతంలో చెప్పిన మాట కూడా లేదు. దేశ ద్రోహం చేస్తే ఆయన పై క్రిమినల్ చర్యలు, సెక్షన్స్ కింద కేసులు పెట్టాలి. అయితే ఆయనకు కేవలం క్రమశిక్షణ చర్యలు కింద మాత్రమే ఈ నోట్ లో నోటీస్ ఇచ్చారు. మరి గతంలో చేసిన ఆరోపణలు ఏమై పోయాయో తెలియదు. గతంలో ఏబీవీ కొన్ని టూల్స్ కావాలని, డీజీపీకి ప్రపోజల్ పెట్టారు, దానికి డీజీపీ ఒక కమిటీ వేసారని, చివరకు టెండర్ వేసారని, కొన్ని కంపెనీలు వచ్చినా, కేవలం ఒక కంపెనీ మాత్రమే ఈ టెండర్ కు ఎలిజిబిల్ అయ్యిందని అన్నారు.
ఈ ఎలిజీబిల్ అయిన కంపెనీ, ఏబీవీ కొడుకు ఒక ప్రతినిధి అని అంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఆధారాలు అయితే ఇప్పటి వరకు ఇవ్వలేదు. అలాగే ఈ టూల్స్ కొనుగోలు కోసం, కేంద్ర సంస్థలో డీజీపీ డబ్బులు డిపాజిట్ చేసారని తెలిపారు. అయితే మధ్యలో ఏబీవీ, డీజీపీకి లేఖ రాస్తూ, తమకు ఈ టూల్స్ తొందరగా కావలని, ఫార్మాలిటీస్ పూర్తి చేసి, తొందరగా వచ్చేలా చూడాలని లేఖ రాసారని తెలిపారు. అయితే ఇందులో లోపాలు ఉన్నాయి అంటూ, ప్రభుత్వం ఈ ప్రోపోజల్ వెనక్కు తీసుకుంటున్నట్టు, డీజీపీ కేంద్ర సంస్థ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ లేఖ రాసారు. 24 కోట్ల 50 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం కట్టిన డబ్బు వెనక్కు ఇవ్వాలని కోరారు. అయితే కేంద్ర సంస్థ, ఇన్నాళ్ళు దీని పై మేము వర్క్ చేసామని, పేపర్ వర్క్ కింద ఇన్నాళ్ళు చేసినందుకు పది లక్షలు కట్ చేసి, మిగతా డబ్బులు రాష్ట్రానికి తిరిగి ఇచ్చేసారు. అయితే ఏబీవీ వల్లే ఈ 10 లక్షల నష్టం అంటూ చివరకు తేల్చారు. అయితే ఇక్కడ ఏబీవీకి ఏ సంబంధం ఉండదు. ఏదైనా చేసేది డీజీపీ, కొనేది కేంద్ర సంస్థ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్. అయితే కొనుగోళ్ళు జరగలేదు. అయితే పది లక్షలు నష్టం జరిగింది, ఏబీవీ బాధ్యలు అవుతారని అంటున్నారు, అవి తీసుకుంది కూడా కేంద్ర సంస్థే. మొత్తంగా ఈ చార్జెస్ చూసిన తరువాత, సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రభుత్వం వేసిన చార్జెస్ చూస్తే, అసలు కొనుగోళ్ళు జరగలేదు, టెండర్ ప్రభుత్వమే రద్దు చేసింది, 10 లక్షలు కూడా కేంద్రమే తీసుకుంది, ఏబీవీ రూపాయి తీసుకునట్టు ఆధారాలు లేవు. చూద్దాం, న్యాయస్థానాలు ఏమి చేస్తాయో.