ఇది దేశ వ్యాప్తంగా వార్త అయినా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం, ఇంకొంచెం ఎక్కువ వార్త అనే చెప్పాలి. 151 సీట్లు గెలిచిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, అన్ని రకాలుగా విఫలమై, కేవలం అప్పులు చేసి, జీతాలు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఆర్ధికంగా ఇబ్బందులు ఒక వైపు ఉంటే, మరో పక్క దళితులు, బీసిలు, మహిళల పై దా-డు-లు నిత్యకృత్యం అయిపోయాయి. ఇక రైతులు సంగతి చెప్పటానికి కూడా ఏమి లేదు. వరుస విపత్తులతో, ప్రభుత్వ సాయం ఏమిలేక కుదేలైపోయారు. మరోపక్క వైసిపీ మాత్రం, సంక్షేమం అదరగొట్టేస్తున్నాం, ఇవన్నీ లైట్ అంటుంది. వీటి అన్నిటి నేపధ్యంలో, మొన్నా మధ్య చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రజలు కష్టాలు త్వరలోనే ఆగిపోతాయని, త్వరలోనే జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయని అన్నారు. అయితే దీన్ని వైసీపీ హేళన చేసింది. జమిలీ లేదు ఏమి లేదు, 5 ఏళ్ళ వరకు ఎన్నికలు ఉండవు, ఎప్పటి లాగే ఎన్నికలు ఉంటాయి, చంద్రబాబు మభ్య పెడుతున్నారు అంటూ ఎదురు దాడి చేసింది. అయతే నెల రోజులు క్రితం ప్రధాని మోడీ, మొదటి సారి జమిలి ఎన్నికల ప్రస్తావన తెచ్చారు. దేశంలో ఎప్పుడూ ఎన్నికలు జరుగుతూనే ఉంటున్నాయని, జమిలి ఎన్నికల పై చర్చ జరగాలి అంటూ, చేసిన వ్యాఖ్యలతో, చంద్రబాబు మాటలు నిజం అయ్యాయి. అయినా సరే, వైసీపీ జమిలి లేదు ఏమి లేదు అంటూ చెప్పుకుంటూ వచ్చింది.

sunil 2112020 2

అయితే ఈ రోజు ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం సంచలన ప్రకటన చేసింది. మేము జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. పార్లమెంట్ లో సవరణ చేస్తే చాలని, తాము జమిలి ఎన్నిలకు రెడీ అంటూ కేంద్ర ఎన్నికల కమీషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. దేశంలో ఎప్పుడూ ఎదో ఒక ఎన్నిక జరుగుతూనే ఉంటుందని, దీని వల్ల దేశ అభివృద్ధి కుంటు పడిపోతుందని, అందుకే దీని పై చర్చ జరగలాని సునీల్ అరోరా అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరగటం వల్ల ఖర్చు కూడా అధికం అవుతుందని, అనవసరపు ఖర్చుని కూడా తగ్గించవచ్చని సునీల్ అరోరా అన్నారు. గతంలో నరేంద్ర మోడీ చెప్పిన మాటలు, నేడు ఎన్నికల కమీషనర్ చెప్పిన మాటలు చూస్తుంటే, జమిలి ఎన్నికలు ఖాయంగానే వస్తాయని అర్ధం అవుతుంది. చంద్రబాబు చెప్పిన మాటలు కూడా నిజం అని తేలింది. 5 ఏళ్ళు అధికారం ఉంటుంది అనుకున్న వైసీపీకి, మూడేళ్ళలోనే ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి వచ్చేలా ఉంది. నిజంగానే జమిలి ఎన్నికలు వస్తాయా ? వస్తే ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ? చూద్దాం అసలు ఈ విషయంలో ఏమి జరుగుతుందో.

Advertisements

Advertisements

Latest Articles

Most Read