గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్రంలో నడుస్తున్న స్థానిక ఎన్నికల విషయం పై హైకోర్టు నేడు తేల్చేసింది. స్థానిక ఎన్నికల పై, కీలకమైన సూచనలు చేసింది హైకోర్టు. స్థానిక సంస్థల ఎన్నికల పై ఇప్పటికే హైకోర్టులో పలు దఫాలుగా విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు అధికారాన్ని కట్టబెడుతూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంభందించి, రాష్ట్ర ఎన్నికల సంఘం వద్దకు, రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సీనియర్ అధికారులను పంపించాలని ఆదేశించింది. ప్రభుత్వం తరుపున పంపించిన ముగ్గురు అధికారులతో, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సంప్రదింపులు జరిపి ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు స్పష్టం చేసింది. క-రో-నా కారణంగా ఎన్నికలు వాయిదా కై, ప్రభుత్వం వైపు నుంచి లేఖ రాయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం లేఖను ఎన్నికల కమిషన్ పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. క-రో-నా వ్యాక్సిన్, స్థానిక ఎన్నికలు రెండు ప్రజలకు సంబంధించినవే కాబట్టి, ఇటు ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రెండు కూర్చుని మాట్లాడకుంటే మంచిదని హైకోర్టు తెలిపింది. లేని పక్షంలో, ముగ్గురు అధికారులను, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్దకు పంపిస్తే, దానికి సంబంధించి పూర్తి వివరాలు, అధికారులు పేర్లు, తేదీ గురించి కూడా తమకు నివేదించాలని హైకోర్టు తెలిపింది.

nimmagadda 2312020 2

ప్రభుత్వ అధికారులు తమ వాదనను, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు వివరించాలని, ప్రభుత్వం వైపు నుంచి ఉన్న అన్ని అభ్యంతరాలను వ్యక్తం చేయాలని హైకోర్టు సూచించింది. ఇప్పటికే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఉన్న నేపధ్యంలో, మీ వాదన మీరు వినిపిస్తే, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంటుందని హైకోర్టు సూచించింది. దీంతో బాల్ మొత్తం, హైకోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోర్టులో వేసేసింది. కాబట్టి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రభుత్వ అధికారులు ఏమి చెప్తారు, తమ వాదన ఎలా వినిపిస్తారు, ఎన్నికల కమీషనర్ ఒప్పుకుంటారా అనే విషయం తేలుతుంది. మొత్తానికి, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిర్ణయమే ఫైనల్ అనే విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అనే చెప్పాలి. హైకోర్టు ఆదేశాల పై ప్రభుత్వం, ముగ్గురు అధికారులను పంపిస్తుందా ? లేక హైకోర్టు మాటలు కాకుండా, సుప్రీం కోర్టుకు వెళ్తారా అనేది చూడాల్సి ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read