రాజకీయ పార్టీలు బయట వ్యక్తుల నుంచి విరాళాలు తీసుకుని పార్టీలు నడపటం సర్వ సాధారణం. ప్రతి ఏడు ఎంత విరాళాలు వచ్చాయి అనేది కేంద్ర ఎన్నికల సంఘానికి అన్ని రాజకీయ పార్టీలు ఇవ్వాలి. సహజంగా ఈ విరాళాలు బ్లాక్ లో ఎక్కువ ఇస్తారు. అవి ఏ రూపాన ఉంటాయో కూడా సామాన్యులకు అర్ధం కాదు. అయితే దీని పై ఊహాగానాలే కాబట్టి, ఏదో గాల్లో మాటలు చెప్పలేం. ఎవరైనా ఎందుకు విరాళాలు ఇస్తారు ? ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చి, ఆ పార్టీ నాయకుల వైఖరి నచ్చి, ఈ పార్టీ ఉండాలి, తమ వంతు సహాయం చేయాలి అనే విధంగా విరాళాలు వస్తూ ఉంటాయి. అయితే అది ఇది వరకటి మాట. ఇప్పుడు అంతా, నీకెంత, నాకెంత లోకి వెళ్ళిపోయింది అనేది అందరికీ తెలిసిందే. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన విరాళాల వివరాలు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే వైసిపీకి ఈ ఏడు భారిగా విరాళాలు వస్తే, అందులో అందరి కంటే ఎక్కువ ఇచ్చిన వ్యక్తిని, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ మీడియా చీల్చి చండాడాయి. ఇంతకీ ఎవరు అనుకుంటున్నారా ? ఆయనే చంద్రబాబు, లోకేష్ బినామీ శేఖర్ రెడ్డి. అవును శేఖర్ రెడ్డి చంద్రబాబు, లోకేష్ బినామీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో గోల గోల చేసింది. తన మీడియాలో ప్రతి రోజు ఇవే కధనాలు ప్రసారం చేసింది.

ysrcp 20122020 12

అయితే గతంలో చంద్రబాబు బినామీ అయిన శేఖర్ రెడ్డి, ఇప్పుడు వైసీపీకి అతి భారీ విరాళం ఇచ్చారు. అంతే కాదు ఈయనకు వైసిపీ అధికారంలోకి రాగానే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబెర్ ని కూడా చేసారు. అప్పట్లో బినామీ అన్న నోటితోనే, ఆయన ఎంతో గొప్పవారు అంటూ, అదే మీడియాలో కధనాలు వేసారు. తరువాత ఇసుక, నెల్లూరులో ఎదో మైనింగ్ కాంట్రాక్టు ఇస్తున్నారని కూడా ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే వాటిని ఖండించారు. అలాంటి శేఖర్ రెడ్డి కంపనీ, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రూ.2కోట్ల 50లక్షలు విరాళం ఇచ్చింది. మొత్తం 2019-20 సంవత్సరంలో, రూ.8కోట్ల 92 లక్షలు విరాళం రాగా, సింహ భాగం శేఖర్ రెడ్డి కంపెనీ జేఎ్‌సఆర్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ నుంచి వచ్చింది. అయితే ఇది చాలా చిన్న అమౌంట్ అనుకోవచ్చు. ఇదంతా వైట్ మనీ అనేది గమనించాలి. సహజంగా పార్టీలు బయటకు చూపించే విరాళాలు ఇలాగే ఉంటాయి. అయితే ఎవరు ఎంత ఇచ్చినా, ఎవరికీ ఇబ్బంది లేదు కానీ, గతంలో చంద్రబాబు బినామీ అని, ఇప్పుడు ఆయనకు పదవులు ఇచ్చి, ఏకంగా ఆయన దగ్గర నుంచి విరాళాలు తీసుకుంటే ఏమనాలో, ప్రజలే నిర్ణయం తీసుకోవాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read