ప్రతి జిల్లాలో వైసిపీ నేతల మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. కొన్ని సార్లు ఇవి బహిరంగం అవుతున్నాయి కూడా. సీనియర్ నాయకులు కూడా ఇందుకు అతీతం కాదు. పిల్లి శుభాష్ చంద్రబోస్ లాంటి సీనియర్ నేతలు కూడా, తమ అసంతృప్తి బహిరంగంగా వ్యక్త పరుస్తున్నారు అంటే, వైసీపీలో జరుగుతున్న కోల్డ్ వార్ అర్ధం అవుతుంది. ఇక ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఈ వివాదాలు తారా స్థాయిలో ఉన్నాయి. అప్పుడప్పుడు బయటకు వచ్చి బాంబు పెల్చుతున్నారు సీనియర్ నేతలు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో సీనియర్ నాయకులు ఎక్కువ. ఆనం కుటుంబం, అలాగే ప్రసన్నకుమార్ రెడ్డి, మేకపాటి, ఆదాల కుటుంబాలు బలంగా ఉన్నాయి. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పెత్తనం మొత్తం, జగన్ మోహన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ కు ఇవ్వటంతో, ఈ పెద్ద కుటుంబాలకు రుచించలేదు. మరో మంత్రి మేకపాటి ఉన్నా, ఆయన జిల్లా పై పెద్దగా పట్టు సాధించటం లేదు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ అనిల్ కుమార్ మాత్రం, పెత్తనం మొత్తం తీసుకోవటంతో, కొంత అసంతృప్తి సీనియర్ వర్గాల్లో ఉంది. ముఖ్యంగా ఆనం కుటుంబం జరుగుతున్న పనుల పై తీవ్ర అసంతృప్తిలో ఉంది. సీనియర్ నేత అయిన ఆనం రాం నారాయణ రెడ్డి, అప్పుడప్పుడు బహిరంగ వేదికల పైనే అసంతృప్తి వ్యక్తం చేసారు.

aanam 26122020 2

మరో ఏడాది చూస్తాను, తరువాత నేరుగా రంగంలోకి దిగుతా అని నాలుగు నెలల క్రిందట వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక ప్రతి సారి అసెంబ్లీలో ఆక్టివ్ గా కనిపించే ఆనం, మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కడా మాట్లాడలేదు. ఇది ఇలా ఉంటే, ఆనం వివేకానందరెడ్డి 70వ జయంతి వేడుకలు జరిగిన సందర్భంలో, ఆనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అంటూ, ఆస్కిక్తర వ్యాఖ్యలు చేసారు. అంతే కాదు, త్వరలోనే మళ్ళీ నెల్లూరు నగరం రాజకీయాల్లో తమ ముద్ర ఏమిటో చూపిస్తాం అంటూ, వ్యాఖ్యానించారు. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసారు, ఎవరికీ ఇవి వార్నింగ్ అనేది మాత్రం క్లారిటీ లేదు. ఇక నిన్న జరిగిన ఇళ్ళ పట్టాల పంపిణీ విషయంలో కూడా, సబ్ కలెక్టర్ తో స్వల్ప సంవాదం జరిగింది. మీరు స్టేజ్ మీద ఉంటే నేను రాను అంటూ, ఆనం సభా వేదిక నుంచి వెళ్ళిపోయారు. అయితే దీనికి, గతంలో ఆనంకు, సబ్ కలెక్టర్ పలు విషయాల్లో సహకరించకపోవటానికి వల్ల ఏర్పడిన వివాదం కారణంగా, ఆనం ఇలా చేసారని తెలుస్తుంది. మొత్తంగా, నెల్లూరు వైసీపీలో సీనియర్ లు అందరూ నివురుగప్పిన నిప్పులా ఉన్నారు. వైసీపీ అధిష్టానం దాన్ని చల్లారుస్తుందా లేదా అనేది చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read