ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ ఇంటి పై డ్రోన్లు ఎగరటం కలకలం రేపింది. అయితే ఇది జరిగింది ఆంధ్రప్రదేశ్ లో కాదు, తెలంగాణాలో. డీజీపీ గౌతం సవాంగ్ కు హైదరాబాద్ లో ఒక ఇల్లు ఉంది. అయితే ఆయన ఇంటి పై కొంత మంది డ్రోన్ ఎగరువేసారు. నాలుగు అయుదు సార్లు ఆయన ఇంటి పై డ్రోన్ ఎగరటంతో, ఎందుకు ఎగిరింది, ఎవరు చేసారు, ఫోటోలు, వీడియోలు తీశారా అనే అనుమానంతో, డీజీపీ గౌతం సవాంగ్ వ్యక్తిగత కార్యదర్శి హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. అయితే వెంటనే ఆ డ్రోన్ ఎగరేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే డ్రోన్ లో అసలు ఏమి ఫోటోలు తీసారు అని పరిశీలించి చూడగా, అందులో ఏమి రికార్డింగ్స్ లేవు. దీంతో, ఆ డ్రోన్ ని స్వాధీనం చేసుకుని, ఇంతకు ముందే డేటా ఏమైనా డెలీట్ అయిపోయిందా, ఏమైనా డేటా రికవరీ చేయవచ్చా అనే ఉద్దేశంతో, డ్రోన్ కెమెరాను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అయితే ఆ డ్రోన్ ఎగరేసిన వ్యక్తీ పై కేసు పెట్టారో లేదో క్లారిటీ అయితే లేదు కానీ, డ్రోన్ స్వాధీనం చేసుకుని, అందులో ఉన్న సమాచారం రికవరీ చేసే పనిలో ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్న ప్రశాసన్ నగర్‌లో ఉన్న డీజీపీ గౌతం సవాంగ్ ఇంటి పై ఈ డ్రోన్ ఎగిరింది. అయితే మరో తెలంగాణా పోలీస్ అధికారి ఇంటి పై కూడా ఇలాగే డ్రోన్ ఎగిరింది అనే వార్తలు వస్తున్నాయి.
అయితే ఇది ఎవరు చేసారో, ఇప్పటికీ క్లారిటీ లేదు. తెలంగాణా పోలీసులు మొత్తం సమాచారం పై ఎంక్వయిరీ చేస్తున్నారు. అయితే ఇది ఇలా ఉంటే, ఇలా డ్రోన్లు ఎగరటం ఈ మధ్య కాలంలో సర్వ సాధారణం అయిపొయింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి పై డ్రోన్ ఎగరటంతో, అప్పట్లో అది పెద్ద గోల అయ్యింది. అయితే అది వరద అంచనా కోసం మేమే పంపించాం అని డీజీపీ చెప్పారు. ఇక మరో పక్క హైదరాబాద్ లో కేటీఆర్ ఫాం హౌస్ పై, రేవంత్ రెడ్డి మనుషులు డ్రోన్ ఎగరువేసి, కేటీఆర్ ది అక్రమ నిర్మాణం అని మీడియా ముందు చెప్పారు. అలాగే పోయిన చంద్రబాబు ప్రభుత్వంలో డీజీపీ గా పని చేసిన ఠాకూర్ ఇంటి ఫోటోలు బయటకు వదిలి, ఆయన అక్రమంగా నిర్మాణం చేసారు అంటూ, కొంత భాగం కూల్చే ప్రయత్నం చేసారు. వీటి అన్నిటి నేపధ్యంలో ఇప్పుడు ఏపి డీజీపీ ఇంటి పై డ్రోన్ ఎగరటం, ఇప్పటికీ క్లారిటీ లేకపోవటంతో, ఆశలు ఎందుకు జరిగిందో అర్ధం కవటం లేదు. అయితే పోలీసులు మాత్రం, ప్రాధమిక విచారణలో ఇందులో ఎలాంటి కుట్ర కోణం లేదని తేల్చారు.